మేలుకున్న మానవత్వం - small moral story

About us

About kiddistory


అందరికి నమస్కారం 

నా పేరు......నేను.....చదువుకున్నాను. నా వయస్సు...... ఇలా అందరు చెప్పినట్లు చెప్తే  కొత్తగా ఏముంటుంది. నేను ఇప్పటి వరకు మీకు కథల రూపంలోనే తెలుసు. అందుకే నన్ను మీకు దగ్గర చేసిన ఆ కథల గురించే చెప్పాలనుకుంటున్న.       ఎందుకంటే కథే నేను, నేనే కథ.

కథ ఓ రెండు అక్షరాల చిన్న పదం. కానీ అది తలచుకుంటే మనల్ని నవ్వించగలదు. ఏడిపించగలదు. మన మీద మనకే కోపం వచ్చేలా చేయగలదు. మన శత్రువుని కూడా ప్రేమించేలా చేయగలదు. మనల్ని అద్భుతమైన ఊహ ప్రపంచంలోకి తీసుకువెళ్లి, తనలోని నవరసాలనిపింది నవరసాల్ని పిండి మనల్ని అబ్బురపరచగలదు. అద్భుతం అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇవ్వగలదు. తనలోని కథకుల భావాల్ని కళ్ళ ముందుకు తెచ్చి మైమరపు ఆశ్చర్యాలలో ముంచగలదు. ఇలా కథ అన్న పదాన్ని ఏమని వర్ణించగలం ఎంతనీ వర్ణించగలం. మనిషికి, కథకి విడదీయలేని అవినావభావ సంబంధం ఉంది అంటే మీరు నమ్మగలరా. పుట్టే ముందు లక్షల కణాలతో పోరాడే వీరుడి కథ. చిన్నప్పుడు స్నేహితులతో, తల్లిదండ్రులతో ఓ ఫ్యామిలీ డ్రామా. తరువాత యుక్త వయసులో ప్రేమలో పడి చెప్పే ఓ హై టెన్షన్ ఫ్యామిలీ డ్రామా. తర్వాత ఓ సంసార సాగరం. చివరికి పుట్టిన వాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. భౌతికమైనది ఏదీ శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఏది భౌతికం కాదు అని చెప్పే జీవితసత్యం. ఇలా ప్రతి దశలో  ఓ కథను వివరిస్తుంది మన జీవితం. అందువల్లనే కథలు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎన్ని కష్టాలు ఉన్నా మనల్ని ఆనందింప చేయగలిగింది కథ. మనిషిని మనిషిగా మార్చేది ఓ కథ. కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా దాటాలి అని చెప్పేది ఓ కథ. అందుకే ఎన్ని తరాలు మారినా చిన్నప్పటినుండి కథలతోనే మొదలవుతుంది మన చదువు. అలాంటి గొప్ప కథల్ని పుస్తకాల రూపంలో రాయలేక, ఏదో ఒక రూపంలోనైనా మీ దగ్గరకు చేరాలనే కోరికతో, ఆరాటంతో ఇలా మీ ముందుకు తీసుకువచ్చాం. చదివిన వారు కథలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అవి మాకు అనుకూలంగా ఉన్న వ్యతిరేకంకంగా ఉన్న మేము వాటిని సమానంగానే స్వీకరిస్తాం. ఎందుకంటే మీరు చేసే నెగిటివ్ కామెంట్లు కూడా మా యొక్క రచన అభివృద్ధికి తోడ్పడుతాయని మేము ఆశిస్తున్నాం. చివరిగా ఒక మాట ఒక్క మాట ధన్యవాదాలు


ఇట్లు

మీ రచయిత ❤️


                            ~  Thankyou for ur love and support ~