మేలుకున్న మానవత్వం - small moral story

దేవుడు ఉన్నాడా? లేడా?

 

Image of lord krishna

ఒకసారి నేను సోషల్ మీడియాలో విహరిస్తూ ఉన్నాను. ఆ సమయంలో  కాలక్షేపం కోసం ఏవో  వీడియోలు చూస్తూ ఉన్నాను. ఇంతలో గరికపాటి నరసింహారావు గారి వీడియో ఒకటి కనిపించింది. ఆయన చెప్పే విషయాలపై నాకు గౌరవం ఉంది. మరి అదీ కాక ఆ వీడియో టైటిల్ లో దేవుడు ఉన్నాడా? లేడా? అని ఉంది. దాంతో నాకు కొంచెం ఆసక్తి కలిగి ఏం చెప్తారా అని క్లిక్ చేశాను. ఆయన ఒక కథ చెప్పడం మొదలు పెట్టారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు క్షవరం చేసుకోవడానికి ఒక మంగలి  వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మంగలి వాడు అతనికి జుట్టు కత్తిరించి, మెడ దగ్గర ఉన్న గడ్డాన్ని గీకుతూ ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా! దేవుడు ఉన్నాడంటారు కదా మరి ఎందుకు ఈ భూమిపై ఇన్ని హత్యలు, మానభంగాలు లాంటి దారుణాలు జరుగుతున్న ఆపడం లేదు అని అడిగాడు. దానికి ఏదో సమాధానం చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ మెడ దగ్గర ఉన్న బ్లేడును చూసి తేడా వస్తే ఏం చేస్తాడో అనుకుని. బాబు నువ్వు ముందు ఆ గడ్డం గీకేయ్ దానికి సమాధానం సాయంత్రం నాతో పాటు వస్తే నీకు చెబుతాను అన్నాడు. సరే అని ఆ పాటికి తన పనిని ముగించాడు మంగలివాడు. సాయంత్రం అయ్యాక ఇద్దరు కలిసి దారిలో అలా నడుస్తూ వెళుతూ ఉన్నారు. దారిలో వాళ్లకు చాలామంది కనిపిస్తున్నారు. వారందరిని పలకరిస్తూ వెళుతూవున్నారు. ఇంతలో కొంత దూరంలో వారికి కొంతమంది వ్యక్తులు కనిపించారు. వారిలో కొందరికి గడ్డి దుబ్బులు లాంటి జుట్టు ఉంది. పొడవాటి గడ్డాలు కూడా ఉన్నాయి. వారిని ఆ మంగలికి చూపించి. ఏమయ్యా ఊర్లో ఇంతమందికి జుట్టు గడ్డం పెరిగిపోయి ఉంటే మంగలివి అయ్యివుండి నువ్వు ఏమి చేయవా? వారందరి కేశపాశాలు కత్తిరించాల్సిన బాధ్యత నీది కాదా అన్నాడు. దానికి ఆ మంగలివాడు అయ్ బాబోయ్! ఏంటండీ అలా అంటారు. వారందరి దగ్గరికి వెళ్లి తిరిగి కత్తిరించాల్సిన పనేటి నాకు. నాకు ఎన్ని పనులు ఉంటాయి. అయినా కత్తిరించుకోవాలంటే వారే నా కొట్టు దగ్గరికి రావాలి, నన్ను అడగాలి, తర్వాత నేను కత్తిరిస్తాను అన్నాడు. అతని సమాధానం విని ఆ బ్రాహ్మణుడు మంగలి వయిన నీకే ఇన్ని పనులుంటే, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమహావిష్ణువుకు ఎన్ని పనులు ఉంటాయి. నీ దగ్గర కత్తిరించుకోవడానికి నువ్వు అన్ని లెక్కలు చెప్తే, మరి ఆ కరుణామూర్తి కరుణించాలంటేనే లెక్కలు ఉండాలి. అనేసరికి ఆ మంగలి కి బోధపడింది దేవుడు అంటే ఏమిటో.

అయినా జరుగుతున్న అన్యాయాలను చూసి కూడా దేవుడు కరుణించడా  అంటే మీకు ఈ సమాధానం ఊరటనివ్వొచ్చు. సమస్తము ఆయనే. తప్పు చేసేవాడు, చేయడం వలన బాధపడిన వాడు, తప్పును ప్రశ్నించేవాడు, తప్పును సమర్థించేవాడు అన్ని ఆయనే. అందుకే ఆయనకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు. ఈ లోకంలో జరిగేదంతా ఓ నాటకం.....


కథ

గరికపాటి నరసింహారావు గారు


( మరిన్ని కథలను చదవండి  )

కామెంట్‌లు