- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఒకసారి ఒక ముని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెళ్లే మార్గంలో అతనికి ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామం గుండా వెళుతూ ఉంటే దారి పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. దాని మీదకు ఎక్కి ఒక అతను చింతపళ్లు దులుపుతూ ఉన్నాడు. కిందన పడిన పళ్ళని అతని కుమారుడు ఒక చిన్న బుట్ట సహాయంతో ఏరుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ముని అక్కడ కొంతసేపు ఆగి ఆ బాలున్ని చూస్తూ ఉన్నాడు. పైనుండి పళ్ళు పడుతున్నాయి, ఆ బాలుడు ఏరుతూ ఉన్నాడు. ఏరిన చోట చోట మళ్లీ పడుతున్నాయి, ఆ బాలుడు మళ్ళీ ఏరుతూ వున్నాడు. మళ్లీ మళ్లీ పడుతున్నాయి, మళ్లీ మళ్లీ ఏరుతూనే ఉన్నాడు. అది బాగా గమనించిన ఆ ముని ఆ బాలుని దగ్గరకు వెళ్లి, బాబు ఎంతసేపని ఇలా ఏరుతూనే ఉంటావు. అటుపడుతూ ఉంది, ఇటు నువ్వు ఏరుతూ ఉన్నావు. నీకు విసుగు రావడం లేదా?. మొత్తం అన్ని పడిన తర్వాత ఒకేసారి ఏరోచ్చు కదా అని అడిగాడు. దానికి ఆ బాబు వినయంగా నాకూ ఒకేసారి ఏరాలని ఉందండి గురువుగారు, కానీ సమయం అయిపోతుంది కదా అన్నాడు. సమాధానంగా ఆ మాట అన్నాడేమో కానీ అందులోంచి ఆ ముని ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ఆ పాఠాన్ని నేర్చుకున్న ఆ ముని ఓ చిరునవ్వు నవ్వి, సరే బాబు ఏరుకో అని చెప్పి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాడు.
ఆ గొప్ప పాఠం చిన్నగా:-
ఇప్పుడు ఆ ముని ఉన్నారు. తను అనుకున్న గమ్యానికి వెళుతూ ఉన్నారు. దారిలో ఒక గంటో అరగంటో విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారనుకోండి. చివరికి తాను అనుకున్న గమ్యానికి గంటో అరగంటో తర్వాత చేరుకుంటారు. చేరుకోవడం మాత్రం చేరుకుంటారు, కానీ ఆలస్యం మాత్రం అవుతుంది. లేదు ఆలస్యం అవ్వకుండా పరిగెత్తి పరిగెత్తయిన వెళ్ళిపోతాలే అని అనుకుంటే, వెళ్లే దారిలో రాళ్లు ఉంటాయి గుద్దుకొని పడొచ్చు. లేదా వెళ్లేదారిలో చీకటి అయిపోతే ఏమీ కనిపించకుండా పోవచ్చు. ప్రతి పనికి ఫలితం అనేది ఉంటుంది నిజమే. ఎక్కువ పనికి ఎక్కువ ఫలితం, తక్కువ పనికి తక్కువ ఫలితం. కానీ దాని కోసం మీరు వెచ్చించే చేసే సమయాన్ని బట్టి ఫలితం వచ్చే సమయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి, మీరు అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోండి.
ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
Thanks for reading
Story by
Writer ram.
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి