- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఒకానొక సమయంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు . ఆయన ఉన్నత భావాలు కలిగిన ఒక గొప్ప జ్ఞాని. అలాగే వక్త. అతను ఎన్నో దేశాలను పర్యటించి హిందూ మతం గొప్పతనాన్ని. అందులో ఉన్న అసలు సిసలైన జ్ఞానాన్ని. అసలు హిందూ మతం ఏం చెబుతుంది. ఇనాటి సమాజం హిందూ మతాన్ని ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకుంది, అలాగే తప్పుగా అనుసరిస్తుంది. మనం ఎలా జీవించాలి అనేది చాటి చెప్పాడు. ఆయన చెప్పే విధానం చాలా గొప్పగా ఉండేది. అందుకే కొన్ని రోజుల్లోనే ఆయన, ఆయన చెప్పే విషయాలు గొప్ప ప్రజాదారణను పొందాయి. అలాంటి ఆయనను ఒకసారి ఒక టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ కోసం పిలిచారు. ఆయన వెళ్లారు. ఆ ఇంటర్వ్యూ ని చూడడానికి అతని అభిమానులు, అతన్ని ఆదరించేవారు. అతని భావాలను వ్యతిరేకించే వారు కూడా వచ్చారు. అప్పుడు ఎదురుగా కూర్చున్న జర్నలిస్ట్ అతనికి ఒక ప్రశ్న అడిగింది. అది " మీరు ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కదండీ మీకన్నా ఉన్నతంగా ఆలోచించే వారిని మీరు ఎక్కడైనా చూశారా? అని అడిగింది. దానికి ఆ పండితుడు ఆ చూశాను, కానీ ఈ మధ్యకాలంలో కాదు 20 ఏళ్ల క్రితం నేను చిన్న ఉన్నప్పుడు అన్నాడు. ఏంటి చిన్నప్పుడా! అదేలాగో తెలుసుకోవాలని ఉందండి చెప్పగలరా అంది ఆ జర్నలిస్ట్. తప్పకుండా అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. నా చిన్నప్పుడు మా ఊరి చివరన ఓ ఇల్లు ఉండేది. అక్కడ ఒకాయన అతని భార్యతో నివసించేవారు. ఆయన వరుసకు నాకు మామయ్య అయ్యేవారు లేండి. ఆయన్ని ఎప్పుడూ చూసినా కోపంగా ముఖం పెట్టుకుని గంభీరంగా ఉండేవాడు. ఊళ్లో ఏ కార్యక్రమం జరిగిన ముందుండేవాడు. అక్కడకు వెళ్లి అది అలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు. అది తప్పు, ఇది ఒప్పు అని అందరూ బుర్ర తినేవాడు. దానివల్ల అతను అంటే ఎవరికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన చెప్పేది నచ్చక అందరు ఆయనతో గొడవ పడేవారు. ఊళ్లో వారందరితో నిరంతర కలహాల వల్ల ఆయన ఊరి చివారన ఉండవలసి వచ్చింది. ఇదిలావుండగా ఒకసారి ఆయన తోటలోకి మేము దొంగతనానికి వెళ్ళాము. ఆ తోట ఆయన ఇల్లు పక్కనే ఉండేది. చుట్టూ భారీ కూడా ఉండేది. రాత్రి సమయం కావడంతో వాళ్లు నిద్రపోతున్నారు. మేము శబ్దం చేయకుండా గోడ దూకి తోట లోపలికి వెళ్ళాం. కానీ మా చెప్పులు కిర్రు కిర్రు మని శబ్దం చేసాయి. దాంతో వాటిని తీసి ఓ పక్కకు పడేసి పళ్ళు ఏరడం మొదలెట్టాము. జేబులనిండా ఏరుకున్నాం ఇంతలో అతనికి కుక్క భౌ అని అరవడం మొదలెట్టింది. దాంతో అతనికి మెలుకువ వచ్చి టార్చ్ పట్టుకుని తోట వైపు రాసాగాడు. అది చూసి మాకు ప్యాంట్లు తడిచిపోయింది. అతనికి దొరికామంటే ఇంకా అంతే సంగతులు. మామూలుగానే రాక్షసుడిలా కనిపిస్తాడు, ఇక దొంగతనం చేస్తూ దొరకమంటే ఏం చేస్తాడో అనుకుని చెప్పులు కూడా ఏరుకోకుండా పరిగెత్తాము. మేము పరిగెడుతుంటే మా జేబుల్లో నుండి పళ్ళు కింద పడిపోతున్నాయి. అప్పటికి మా అత్యాశ ఎలా ఉందంటే, అతను తరుముకుని వస్తున్న సరే కింద పడిన పళ్ళని ఏరుతూ ఉన్నాము. ఎలాగోలా అతనికి దొరకకుండా బారిగోడ దాటేసాము. మేము తప్పించుకున్నాం కానీ మా చెప్పులు దొరికేసాయి అతనికి. మా నాన్న డబ్బులు లేవు అంటున్న సరే ఏడ్చి ఏడ్చి కొనిపించుకున్నాను అవి. ఇక అవి పోయాయి అని తెలిసిందో మా నాన్న ఏం చేస్తాడు అని భయం పట్టుకుంది. మెల్లిగా గోడ ఎత్తి ఎక్కి చూసాను. ఆయన మా అందరి చెప్పులను పట్టుకుని వెళ్లిపోతూ కనిపించాడు. ఇంక అంతే రేపటికి మా నాన్న చేతిలో నా పని అయిపోతుంది అని అనుకున్నాను. ఆ భయంతో ఏరిన పళ్ళని కూడా సరిగా తినకుండా ఇంటికి వెళ్ళి పడుకున్నాను. కానీ ఆ భయంతో అసలు నిద్ర రావట్లేదు. కళ్ళు మూసిన ప్రతీసారి మా నాన్న కనిపిస్తున్నారు, చెప్పులేవి అని అడుగుతున్నారు. దొంగతనానికి వెళ్లకపోయి ఉంటే బాగుండేది అనుకున్నాను. అసలు మా ఫ్రెండ్స్ తో కలవకపోయి ఉంటే బాగుండేది అనుకున్నా అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకుని ఏం లాభం అనుకున్నాను. రేపు ఉదయం మా నాన్న అడిగితే ఏం చెప్పాలో అని ఆలోచించాను. చివరిగా ఒక్క మాట చెప్పాలనుకున్నాను అది "రాత్రి ఇక్కడే పెట్టాను నాన్న ఏమో మరి ఎవరు పట్టుకెళ్లారో ". అలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో గరిపేసాను ఆ రాత్రి. ఉదయం అవుతూ ఉంది. రాత్రంతా నిద్రపోక పోవడం వల్ల నిద్ర కమ్ముకొస్తూ ఉంది. ఇంతలో మా నాన్న నన్ను పిలిచాడు. ఆయన పిలుపుతో నాకు కమ్ముకుంటున్న నిద్ర మేఘాలు మొత్తం ఎగిరిపోయింది. తుళ్ళిపడి లేచాను. ఆయన ఇంకోసారి పిలిచేసరికి చేసేదేం లేక తలదించుకుని ఆయన దగ్గరికి వెళ్లాను. చేతులు కట్టుకుని దెబ్బలు తినడానికి రెడీ అయిపోయి ఉన్నాను. ఏదైనా అడిగితే చెప్పడానికి రాత్రి అనుకున్న సమాధానం రెడీగా ఉంది. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, ఏరా నిన్న రాత్రి ఆ వీధి చివరి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అని అడిగారు. అదివిని సమాధానం చెప్పలేక నా గొంతు ఎండిపోయింది. ఎలాగోలా కష్టపడి అవును అన్నాను మెల్లిగా. ఎందుకు అని అడిగారు ఆయన. నేను దిష్టిబొమ్మలాగా ఏం చెప్పక మౌనంగా ఉండిపోయా. నా మౌనాన్ని భరించలేక ఎందుకు వెళ్ళావో చెప్పు అని మా నాన్న గద్దించాడు. అది చూసి భయపడి నిజం చెప్పేయబోయాను. కానీ ఇంతలో ఆయనే, సరే వెళ్తే వెళ్లావు చెప్పులు ఎందుకు వదిలేసి వచ్చావు అని చేతిలో ఉన్న చెప్పులను కింద పెట్టారు. వాటిని చూసి ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిగింది. మీకు ఇది ఎవరు ఇచ్చారు అని అడిగాను. మీ మామయ్యే, రాత్రి వచ్చి మర్చిపోయారు ఇదిగో అని ఇచ్చాడు. అలా చెప్పులు మర్చిపోతే ఎలా చెప్పు అసలే వంద రూపాయలు అంటూ నా బురద పట్టిన చెప్పులకు నీళ్లు పోస్తూ తన చేతులతో కడిగాడు మా నాన్న. అది చూసి నేను మా మామయ్యకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను, క్షమాపణలు కూడా. దానికి రెండు కారణాలు నా చెప్పులను తిరిగి ఇచ్చినందుకు, నేను దొంగతనం దొంగతనానికి వెళ్లిన విషయం చెప్పనందుకు. నేను దొంగతనానికి వెళ్లిన విషయం చెప్పలేదని నాకు ఎలా తెలిసిందంటే, చెప్పి ఉంటే ఈపాటికి నాకు దెబ్బలు పడిపోయి ఉండేది కాబట్టి. అని ఆపాడు ఆ పండితుడు. ఆ కథ విని జర్నలిస్ట్ కథ బాగుంది సార్, కాని నేను అడిగిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదేమో అని అంది. దానికి ఆ పండితుడు అవును అన్నాడు. మరి ఎందుకు సార్ చెప్పారు సమయం వృధా చేయడానికా అని అడిగింది. అప్పుడు ఆ పండితుడు నేనింకా కథ పూర్తి చేయలేదమ్మా అని, పక్కనే బాటిల్లో ఉన్న నీళ్లను తీసుకుని తాగాడు. తర్వాత మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. నేను మనసులో ఆయనకు క్షమాపణలు చెప్పుకున్నాను. కానీ నా మనసు ప్రశాంతంగా ఉండలేకపోయింది. దాంతో ఒకరోజు ధైర్యం చేసి వెళ్లి ఆయనను క్షమించమని అడిగాను. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయన ఆ క్షణం నవ్వుతూ పర్లేదులేరా అన్నారు. ఆయన అలా అనేసరికి నా మనసులో అప్పటి వరకు ఉన్న ఏదో తెలియని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టయింది. తర్వాత నేను అతన్ని ఇలా అడిగాను, అవును మామయ్య మేము దొంగతనం చేసిన సరే మా చెప్పులను ఎందుకు తిరిగి ఇచ్చేసావు. దానికి ఆయన చెప్పిన సమాధానం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఒరేయ్ నేను ఆరోజు చెప్పులను ఎక్కడయినా పారేసి ఉంటే, బాధపడేది నువ్వు మాత్రమే కాదురా మీ నాన్న కూడా. ఆ చెప్పులను నీకు కొనివ్వడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు చెప్పు. అలాంటిది ఆ చెప్పులు పోతే మళ్ళీ నీకు కొన్ని ఇవ్వలేక, నిన్ను చెప్పులు లేకుండా చూడలేక బాధపడతాడు. అందరి పిల్లలు చెప్పులతో ఉంటే నిన్ను మాత్రం ఒట్టికాళ్లతో చూస్తే మీ నాన్న మనసు ఎంత చలించిపోతుందో ఆలోచించు. అలా ఆలోచించాను కాబట్టే నీ చెప్పులను నీకు తిరిగి ఇచ్చాను అన్నాడు. అని ఆపాడు ఆపండితుడు. అతని సమాధానానికి ఆడిటోరియంలో ఉన్నవారందరి చేతులు చప్పట్లతో మారు మోగిపోయింది. తర్వాత ఆయన ఆపమన్నట్లు సైగచేసి జర్నలిస్ట్ ని ఉద్దేశించి, ఇంతకన్నా ఉన్నతంగా ఆలోచించేవారు మీకు ఎక్కడైనా కనపడ్డారా అని అడిగారు. దానికి ఆమె లేదండి అంటూ తను కూడా చప్పట్లు కొట్టింది. దాని తర్వాత మళ్లీ ఆ పండితుడు ఆయన గురించి చెప్పాడు. ఆయన ఊళ్లో ఏ కార్యక్రమం జరిగిన ముందుండేవాడు అది చిన్నదవనీ, పెద్దదవనీ. పెళ్లి అవనీ చావు అవనీ అన్నింట్లో ముందు ఉండేవాడు. ఊర్లో వాళ్ళు అందరూ అతని ప్రవర్తన వల్ల అతన్ని పట్టించుకునే వారు కాదు. కానీ అతను అదేమి పట్టించుకునేవాడు కాదు. ఆ కార్యక్రమానికి వెళ్లి ఏదో పని చేసేవాడు. కార్యక్రమం అయిపోయాక ఆ ఇంట్లో వాళ్ళు సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఊర్లో వాళ్లకు చిన్నపాటి పార్టీ ఇచ్చేవారు. కానీ ఆయన మనకు మనకు మధ్య కృతజ్ఞతలు ఏంటి అనుకుని దాన్ని స్వీకరించేవాడు కాదు. లోపల ఎంత మంచితనం ఉన్న బయట గంభీరంగా కనిపించేవాడు. అలా ఎందుకు మామయ్య అని అడిగితే. అలా ఉండకపోతే ఎవరు మన మాట విన్నార్రా అబ్బాయ్! కార్యక్రమాలు ఎవరికి నచ్చినట్లు వారు చేసుకుపోతారు. నేనుండగా ఏదీ తప్పుగా వీళ్లు చేయకూడదు అంటాడు. కానీ దానివల్ల ఎవరు తప్పు చేయకూడదు అనుకుంటున్నారో వారికే దూరమవుతున్నారు కదా అంటే. దానికి ఏం చెప్పాలో తెలీక ఒక క్షణం మౌనం వహించి, ధర్మం ఎప్పుడూ ఒంటరి దేరా అని కళ్ళతో ఏడుస్తూ పెదవితో ఓ నవ్వు నవ్వేవాడు. నిజమే ధర్మం ఎప్పుడు ఒంటరిదే అందుకే ఆయన చనిపోయినప్పుడు తలకొరివి పెట్టడానికి ఆయనకు ఒక కొడుకుని కూడా ఇవ్వలేదు ఆ దేవుడు. ఆయన అంతిమయాత్రకు పట్టుమని పదిమంది కూడా రాలేదు.కష్టాన్ని, సుఖాన్ని... భయాన్ని, బాధని.... సంతోషాన్ని, దుఃఖాన్ని.... ఏడు జన్మలైనా నీతోనే పంచుకుంటాను, అని అతనితో ఏడడుగులు వేసిన తన అర్ధాంగే అతనికి తలకొరివి పెట్టింది. తర్వాత తను కూడా అక్కడే చనిపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ పండితుడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఉన్న వాళ్లందరి కళ్ళలో కూడా నీళ్లు తిరిగసాగాయి....
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి