మేలుకున్న మానవత్వం - small moral story

చివరి జ్ఞాపకం - volume 4 - telugu stories

Telugu


అది D.N.K పార్టీ కార్యాలయం. కొందరు పార్టీ పెద్దలతో C.M నడక నాగరాజు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అందులో అతను ఇలా మాట్లాడాడు. పార్టీ పెద్దలందరికీ నమస్కారం. ఈమధ్య మన గవర్నమెంట్ సీక్రెట్ గా చేయించిన జియోలాజికల్ సర్వేలో, మన రాష్ట్రంలో ఉన్న ఈ రెండు ప్రాంతాలలో బంగారం దొరికే ప్రదేశాలు కనుగొన్నారు. అని మ్యాప్ లో ఆ ప్రాంతాలను చూపించాడు. మళ్లీ ఇంకో రెండు ప్రదేశాలను చూపిస్తూ, ఇక్కడ యురేనియం దొరికే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు అన్నాడు. అప్పుడు పార్టీలోని ఒక పెద్దాయన లేచి, అయితే ఇప్పుడు ఏమంటావు ఆ ప్రదేశాల్లో ఉండే వారిని మన మనుషులతో ఖాళీ చేయించమంటావా అన్నాడు. అది విని నాగరాజు అన్ని విషయాల్లో వైలెన్స్ పనికిరాదు పెద్దాయన, కొన్నిసార్లు బుద్ధితో కూడా ఆలోచించాలి అని అతని కూర్చోబెట్టాడు. అసలు సమస్య అది కాదు. ఆ ప్రాంతాలు చాలా లోతు ప్రాంతాలు. అక్కడకు మన ఇప్పటి వాహనాలు, యంత్రాలు వెళ్లడానికి ఆస్కారం లేదు. దాని గురించి నేను మన టెక్నికల్ డిపార్ట్మెంట్ తో కూడా చర్చించాను. వారు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లడానికి వీలయ్యేలా యంత్రాలను డిజైన్ చేస్తున్నారు. కానీ అది ప్రయోగాలనుండి ప్రాక్టికల్ కు రావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అన్నాడు. అదే ఇక్కడ సమస్య, ఈ మూడు సంవత్సరాల తర్వాత మనం ఒకవేళ పవర్ ని కోల్పోతే, కొన్ని లక్షల కోట్లు మన ప్రతిపక్షం జేబుల్లోకి వెళ్లిపోతుంది. ఎలాగైనా మన ప్రభుత్వం వచ్చే ఎలక్షన్స్ లో గెలవాలి అన్నాడు. అది విని ఆ పార్టీ పెద్ద దగ్గుకుంటూ లేచి కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదులుకోవాలి. నువ్వేదో హామీలు ఇచ్చి ఉన్నావుగా అవన్నీ నెరవేర్చేయ్ అది చాలు మనం గెలవడానికి. వచ్చేదానితో పోలిస్తే, పోయేది ఏమీ ఎక్కువ కాదు కదా ఏమంటావు అన్నాడు. అతని మాటలు విని పార్టీలో ఇతరులు కూడా అతన్ని సమర్థించారు. అప్పుడు ఆ పార్టీ పెద్ద నాగరాజు వైపు చూశాడు. నాగరాజు కూడా అలాగే అన్నట్టు చిన్నగా తలూపాడు.

* * * * * *

వంట గదిలో నుండి వస్తున్న తాలింపు ఘాటుకి దగ్గుతూ,తుమ్ముతూ నిద్ర లేచాడు శివ. లేచి మా అమ్మకు జ్వరం తగ్గినట్టుంది, అందుకే ఉదయాన్నే లేచి వంట మొదలెట్టింది అనుకున్నాడు. నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంది. అమ్మా జ్వరం తగ్గిందా అన్నాడు. దానికి వాళ్ళ అమ్మ చిన్నగా ఓ నవ్వు నవ్వింది. అప్పుడు శివ వాళ్ళ అమ్మను పట్టుకుని, అటు ఇటు ఊగుతూ అమ్మా మనం సినిమాకు వెళ్దామా అన్నాడు. తను ఇప్పుడా వద్దు నేను పనికి వెళ్లాలి అని అంది. శివ అబ్బా ఎప్పుడు వెళ్లేదే కదా ఈరోజు వదిలేయవచ్చు కదా అన్నాడు. తర్వాత వెళ్దాంలే ఇప్పుడు వద్దు అంది. అబ్బా వెళ్తాం అమ్మా అయినా నీకు సినిమాలు అంటే ఇష్టం కదా అన్నాడు. తను శివ మాటలు పట్టించుకోకుండా, కూర కలపటానికి గరిట ఎక్కడుందా! అని చుట్టూ చూసింది. శివ ఆ గరిట అందుకుని, నువ్వు సినిమాకు వెళ్దాం అంటేనే గరిట ఇస్తాను లేకుంటే ఇవ్వను అన్నాడు. వాళ్ళమ్మ అరే! గరిట ఇవ్వు కూర మాడిపోతుంది అంది. అబ్బా మనం వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. అరే ఇవ్వు టైం అయిపోతుంది అంది అమ్మ. అయినా శివ గరిట ఇవ్వకపోయేసరికి చిరాకుతో శివని వాళ్ళ అమ్మ గూబమీద ఒక్కటి ఇచ్చింది. దాంతో కోపంతో గరిటెను వాళ్ళ అమ్మకు ఇచ్చేసి, గూబమీద చెయ్యి వేసుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె వంట వండి పనికి వెళ్లడానికి క్యారేజ్ సిద్ధం చేసుకుంది. తర్వాత రేడి అవ్వి తీసుకుని గబగబా బయలుదేరింది. బయట వరండాలో శివ గూబ మీద చెయ్యి వేసుకుని మౌనంగా కూర్చుని ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాడిని చూసి, కొంతసేపు తర్వాత మళ్లీ మామూలుగా అవుతాడులే అనుకుని వెళుతూవుంది. అప్పుడు శివ, ఆ డాక్టర్ చెప్పింది నిజమేనా అమ్మ" అన్నాడు. ఆ మాట విని ఒక్కసారిగా ఆగిపోయింది తను. శివ, నేను అంత విన్నాను అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా నువ్వు. అప్పుడు నాన్న, ఇప్పుడు నువ్వు అసలు నేను ఏమి తప్పు చేశానమ్మ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదేదో నేను పుట్టినప్పుడే వదిలేసి ఉంటే చిన్నప్పుడు నుండి అనాధల పెరిగే వాడిని. ఎందుకు నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పమ్మా నేనంటే మీకు ఇష్టం లేదా నేనేం పాపం చేశాను అన్నాడు. శివ అన్న మాటలకు ఆమె కంట్లో నీళ్లు తిరగసాగాయి. ప్లీజ్ అమ్మ నాకు ఎప్పటికీ నీతోనే ఉండాలని ఉంది, ఎప్పటికీ...అన్నాడు ఏడుస్తూ. వాళ్ళమ్మ చేతిలో ఉన్న క్యారేజీ కింద పడింది. తను వచ్చి శివని గట్టిగా కౌగిలించుకుంది. శివ కూడా వాళ్ళమ్మని చుట్టేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మతో నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా అన్నాడు. దానికి తను నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నీ ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనల్లోనూ, నీ జ్ఞాపకాల్లోనూ ఎప్పటికీ నీతోనే ఉంటాను అంటూ అతని తలని ముద్దాడింది. కానీ నువ్వు ఉండవు కదా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, చూడు శివ సంవత్సరంలో వచ్చే కాలాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారకపోతే సంవత్సరం ఎప్పుడు కొత్తగా ఉండదు. ఏం మారదు. అందుకే ఆ దేవుడు ప్రతి బంధంలో ఒక రోజుని ఇస్తాడు. ఆరోజు ఆ బంధం తెగిపోతుంది. కానీ అది మన విషయంలో కొంచెం ముందుగానే వచ్చింది అని అంది ఏడుస్తూ. ఆ కాలాలు లాగానే మనం కూడా వేరైపోయిన, ఆ కాలం ఇచ్చిన జ్ఞాపకాలతోనే జీవితాన్ని గడపాలి అంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకు శివ వెక్కి,వెక్కి ఏడ్చాడు. అప్పుడు వాళ్ళమ్మ అతని ముందు మోకరిల్లే తన చీర కొంగు తో శివ కళ్ళను తుడిచింది, అతన్ని ఓదార్చింది.

శివ తేరుకొని మరి నువ్వు ఎప్పుడూ నాతో ఉండాలంటే ఇప్పుడు నాతో ఉండాలి కదా అన్నాడు. దానికి వాళ్ళ అమ్మ హుమ్... ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంది. మనం సినిమాకి వెళ్ళాలి అన్నాడు. సరే అయితే వెళ్దాం వెళ్లి రెడీ అవ్వు అంది తను. నిజంగానా అన్నాడు శివ. తను అవునన్నట్టు తల ఊపింది. సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తా అని రెడీ అవ్వడానికి తుర్రుమని పారిపోయాడు. దాని తర్వాత వారు సినిమాకి బయలుదేరారు. వెళ్లడానికి అయితే వెళ్లిపోయారు కానీ తర్వాతే తెలిసింది అది ఒక హర్రర్ సినిమా అని. వాళ్ళ అమ్మ మామూలుగానే చూసింది, కానీ శివనే వాళ్ళ అమ్మకు కొంగు వెనకాల నుండి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. భయంతో కుర్చీ లోపలికి జారిపోయాడు. తర్వాత వారు జూ పార్క్ కి, వాటర్ వరల్డ్ కి, వాటర్ ఫాల్స్ కి ఇలా చెప్పుకుంటూ పోవాలెగాని చాలా ప్రదేశాలకే వెళ్లారు. శివ తను దాచుకున్న డబ్బులను ఖర్చుపెట్టి వాళ్ళమ్మ చెబుతున్న వినకుండా తన కోసమని ఓ పెద్ద టీవీని కొన్నాడు. తన పుట్టినరోజు జరిపి ఒకరి ముఖంలో ఒకరు కేకు ముక్కలతో కొట్టుకున్నారు. అలా ఆనందంగా గడిచింది ఆ వారం. ఇప్పుడు శివకు ఎటు చూసినా వాళ్ళమ్మతో గడిపిన క్షణాలే కనిపిస్తున్నాయి. బీచ్ వైపు చూస్తే అక్కడ కూర్చుని వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్పుకున్న క్షణాలు. రోడ్డు వైపు చూస్తే సినిమా చూసి నవ్వు కుంటూ తిరిగి వచ్చిన క్షణాలు. వరండాలో నిల్చుంటే అక్కడ వాళ్ళమ్మ వాళ్ళ అమ్మతో చెప్పుకున్న కధలు, తాను వేసిన నాటకాలు. అప్పుడు వాళ్ళ అమ్మ పెదాలలో చిగురించిన చిరునవ్వు అన్ని గుర్తుకు వస్తున్నాయి. 

******************

ఆరోజు శివ ఉదయాన్నే లేచి గబగబా రెడీ అయిపోయాడు. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా, అమ్మా అని నిద్రలేపాడు. తను కొంచెం నీరసంగా ఏంట్రా ఇంత పొద్దున్నే అంది. ఈరోజు గుడికి వెళ్దాం అన్నావు కదా అన్నాడు. తను, నాకు రాత్రి నుండి ఎందుకో కొంచెం నీరసంగా ఉందిరా, నువ్వు వెళ్లి వచ్చేయి అంది. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను అన్నాడు శివ. పర్లేదులే నా పనులు నేను చేసుకోగలను నువ్వు వెళ్లి రా అంది. సరే అయితే ఎటు వెళ్లొద్దు అని చెప్పి, గుడికి ఒంటరిగా బయలుదేరాడు. వెళ్లే ముందు డబ్బులు కోసమని బీరువాని తెరిచాడు. బీరువాలో చేతిపెట్టి లోపల అంతా వెతికాడు. చివరికి ఓ మూలన ఉన్న ఒక వంద రూపాయలు తగిలింది అతని చేతికి. డబ్బంతా అయిపోగా చివరికి మిగిలింది అదే. ఆ వంద రూపాయలని చేతిలో తీసుకుని విచారంగా ఓ నవ్వు నవ్వాడు. తర్వాత ఏదయితే అది అయ్యిద్దని దాన్ని జేబులో పెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఆ వంద రూపాయలతో కొబ్బరికాయలు, పళ్ళు కొనుక్కుని తన చిన్న కర్ర సంచిలో వేసుకున్నాడు. తర్వాత మళ్లీ నడక ప్రారంభించాడు. అలా నడుస్తూ వెళ్తున్న అతనికి మనసులో వాళ్ళ అమ్మతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆమె తనతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని అనుకున్నాడు. గుడికి వెళ్ళాక ఆ దేవున్ని కూడా అదే ప్రార్థిద్దాం అనుకున్నాడు. అదే కోరుకుందాం అనుకుని ఆ దేవున్ని మనసులో తలుచుకున్నాడు. అతను అలా వెళుతూ ఉండగా వెనుక నుండి ఓ కారు వేగంగా వచ్చింది. ఆ కారు అలా వేగంగా వచ్చి వెళ్లగానే, పక్కనే గుంటలో ఉన్న బురద నీళ్లు శివమీద తుళ్ళింది. ఆ కారు అతను మాత్రం అదంతా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ బురదతో గుడికి వెళ్లలేక ఏం చేయాలో అర్థం కాక తన దుస్థితిని తలుచుకుని బాధపడ్డాడు. బహుశా నాలాంటి పేదవాడు గుడికి వెళ్లడానికి కూడ యోగ్యుడు కాదేమో, అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు అనుకుని ఏడ్చాడు ఆ 12 ఏళ్ల చిన్న కుర్రాడు. చేసేదేం లేక తన చేతిలో ఉన్న సంచిని పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసి వెనుతిరిగాడు. ఇంటికి తిరిగి వెళ్ళిన శివకు దూరం నుండి చూస్తే, వాళ్ళ ఇంటి ముందు ఏదో బండి ఆగి ఉండటం కనిపించింది. అది చూసి గబగబ నడుచుకుంటూ వెళ్ళాడు అతను. దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది ఓ అంబులెన్స్ అని. ఇంతలో కొందరు వాళ్ళమ్మని స్ట్రేచర్ మీద ఎత్తుకు వచ్చి అంబులెన్స్ లోకి ఎక్కించారు. అది చూసి శివ కంగారుపడుతూ సార్ మా అమ్మని ఎక్కడికి తిరిగి తీసుకెళ్తున్నారండి, చెప్పండి సార్ అని అడిగాడు. అప్పుడు ఒక అతను శివ దగ్గరకు వచ్చి, చూడు తమ్ముడు మీ అమ్మకు అర్జెంటుగా సర్జరీ చేయాలి. లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. నువ్వేమీ కంగారు పడకుండా మొన్న వచ్చిన హాస్పిటల్కు వచ్చేయి అన్నాడు. కానీ అన్న అని శివ ఏదో చెప్పబోతుంటే, నువ్వేం చెప్పకు ఏదైనా ఉంటే హాస్పిటల్ లో మాట్లాడుకుందాం అన్నాడు అతను. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నా అని పిలిచింది. శివ అంబులెన్స్ దగ్గరకి వెళ్లి అమ్మ నువ్వేం కంగారుపడకు నేను వచ్చేస్తాను, నువ్వేమీ కంగారుపడకు అన్నాడు.( ఇంతలో అంబులెన్స్ డోర్స్ మూసుకుపోయింది)

*********************

శివ ఆపరేషన్ థియేటర్ బయట కూర్చుని ఉన్నాడు. ఓ రెండు గంటలు గడిచింది, డాక్టర్లు మెల్లిగా ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తున్నారు. అప్పుడు శివ వాళ్ళ దగ్గరకు వెళ్లి, డాక్టర్ గారు మా అమ్మకు ఎలా ఉందండి అని అడిగాడు. డాక్టర్, నువ్వు నా కేబుల్ లోకి వెయిట్ చెయ్యి నేను వస్తాను అన్నాడు. శివ సరే అండి అన్నట్టు తలూపాడు. శివ వెళ్లి డాక్టర్ క్యాబిన్ లో కూర్చుని ఉన్నాడు. చాలాసేపటి తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ని చూసి శివ లేచి నిల్చున్నాడు. డాక్టర్ ఆ పర్లేదు కూర్చో అని చెప్పి తనూ కూర్చున్నాడు. అప్పుడు శివ, మా అమ్మకు ఎలా ఉందండి అని మళ్ళీ అడిగాడు. దానికి డాక్టర్ ఆ ....... తను బానే ఉంది, ఓ వారంలో మళ్లీ తను మామూలుగా అయిపోతుంది అన్నాడు. అది విని శివ చాలా సంతోషించారడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు, మళ్లీ అతని మొహంలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. కానీ డాక్టర్ గారు ఆపరేషన్ కోసం మేము డబ్బులు కట్టలేదు కదండీ అన్నాడు. అది విని డాక్టర్ కంగారుగా పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు 

హలో ఏంటయ్యా! ఈ బాబు డబ్బులు కట్టలేదు అంటున్నాడు. ఇక్కడేమో ఆపరేషన్ జరిగిపోయింది. అసలు మీరు ఎవరిని తీసుకువచ్చారు? ఏంటి మనిషి మారిపోయారా? అది ఇప్పుడు చెప్పేది బుద్ధి లేకుండా. 10 లక్షలు బుగ్గ పాలు చేశారు కదా. మీలాంటి వాళ్లకు జాబు ఇచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని, టేబుల్ పై ఉన్న ఫైల్ ని ఎత్తి కొట్టాడు. అప్పుడు శివ తుళ్ళి పడ్డాడు. ఇంకా ఏంటి మౌనంగా వింటున్నావు? నేను ఏమైనా హరికథ చెప్తున్నానా వెళ్లి I.C.Uలో ఉన్న ఆమెను బయటకు గెంటేయండి అన్నాడు ఫోన్లో. అది విని శివ కంగారుగా డాక్టర్ కాళ్ళను పట్టుకుని, సార్ సార్ ప్లీజ్ సార్ మా అమ్మని ఏం చేయొద్దని చెప్పండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదిచూసి డాక్టర్ చిన్నగా ఓ నవ్వు నవ్వి శివని పైకి లేపి, ఏం శివ నమ్మేశావా? అన్నాడు. శివకు ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు.( శివకు కన్నీళ్లు తుడుచుకో అన్నట్టుగా సైగ చేశాడు, శివ తుడుచుకున్నాడు). డాక్టర్, ఊరికే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అలా ఫోన్ చేసాను. పర్లేదు బాగానే కంగారు పడ్డావు. (అన్నాడు చిన్నగా నవ్వుతూ.) నిజానికి మీ అమ్మపై నీకున్న ఆ ప్రేమే తనను ఈరోజు బ్రతికించింది. ఆ డబ్బు గురించి నువ్వేమీ దిగులు పడకు నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీనే అన్నాడు. అది విని శివకు ఆనందం తన్నుకు వచ్చింది, కాని కొంచెం అనుమానం కలిగి నిజంగాన అన్నాడు. డాక్టర్ అవునన్నట్టుగా తలూపాడు. దాంతో శివ ఆనందంతో డాక్టర్ చేతులని పట్టుకుని మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు అన్నాడు.(ఆనందభాష్పాలు రాలుస్తూ) 

పర్లేదు మామూలుగానే చెప్పు అన్నాడు డాక్టర్ (నవ్వుతూ). అతని సమాధానం విని శివ కూడా కొంచం నవ్వుతూ, థాంక్యూ డాక్టర్ థాంక్యూ అన్నాడు. 

********

శివని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించారు. శివ లోనికి వెళ్ళాడు. వాళ్ళమ్మని బెడ్ మీద పడుకోపెట్టి వున్నారు. తన దగ్గరికెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని చేతి స్పర్శకు ఆమె మేల్కొంది. శివ వాళ్లమ్మ వైపు చూసాడు, తను శివ వైపు చూసింది. ఆ క్షణం ఇద్దరి కళ్ళల్లోనుండి నీళ్లు వచ్చాయి. కాని అవి బాధతో వచ్చినవి కావు. ఎందుకు వచ్చాయో మీకు తెలుసు....

ఇంతకీ ఆమెకు ఆపరేషన్ కోసం డాక్టర్లు డబ్బులు ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారా. మీకు నడక నాగరాజు గుర్తున్నాడా? అదేనండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. క్షమించండి కథలో రాష్ట్ర ముఖ్యమంత్రి .అతను ముఖ్యమంత్రి అయితే చాలా ఫ్రీ పథకాలు ఇస్తానన్నాడు. అందులో ఈ ఉచిత ఆపరేషన్ పథకం కూడా ఒకటి. అది ఇచ్చేశాడు, కాని దురదృష్టం అతని పక్కన దుప్పటి కప్పుకుని పడుకున్నట్టుంది వచ్ఛే ఎలక్షన్స్ లో అతను గెలవలేదు....

మళ్ళీ పదవి కోసం పాదయాత్ర చేస్తూ.. " ఆంధ్రప్రదేశ్ లో వున్న ఆర్ధిక ఇబ్బందులను, నడిరోడ్డులో పెట్టి నగ్నంగా కడిగేదాకా ఈ నడక నాగరాజు నడక ఆపడు. అంటూ తన అరిగిపోయిన అర్ధరూపాయి స్పీచ్ లు మొదలుపెట్టాడు.


శుభం..


Read more parts

Part one :- volume 1

Part two :- volume 2

Volume: :- volume 3

కామెంట్‌లు