- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అమ్మ నా క్యారేజ్ రెడీ చేసేసావా అన్నాడు శివ. ఆ..చేసేసానురా అని క్యారేజ్ అతను చేతికి అందిస్తూ, చెయ్యి బాలేదు కదా ఈరోజు పని వదిలేయవచ్చు కదరా అంది అమ్మ. చిన్న గాయమే కదే పర్లేదులే అని క్యారేజ్ పట్టుకుని వెళ్లిపోయాడు. హుమ్.. వీడు నా మాట ఎప్పుడు విన్నాడని అనుకుని తను ఇంటిలోకి వెళ్ళిపోయింది. తను కూడా రెడీ అవ్వి ఓ చేతి సంచిని తీసుకుని బ్యాంకుకు బయలుదేరింది. ఎందుకోగాని ఆరోజు బ్యాంకు మొత్తం ఖాళీగా ఉంది. కానీ ఎంప్లాయిస్ అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందులో ఒక అమ్మాయిని చూసి తన దగ్గరికి వెళ్ళింది తను. ఆ ఎంప్లాయ్ చెప్పండి మేడం నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అంది. తను డబ్బులు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలి మేడం అంది. సరే ఒక రెండు నిమిషాలు అక్కడ కూర్చోండి, నేను మా మేనేజర్ తో మాట్లాడి మళ్లీ మిమ్మల్ని పిలుస్తాను అంది. సరే అని తను వెళ్లి పక్కనే ఉన్న బల్ల మీద కూర్చుంది. కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి తనను పిలిచింది. కానీ తను ఎటో ఆలోచిస్తూ ఆమెను పట్టించుకోలేదు. తన మనసులో ఏవేవో ఆలోచనలు మెదలుతున్నాయి. ఈసారి ఆ ఎంప్లాయ్ కొంచెం గట్టిగా పిలిచేసరికి దాని నుంచి తేరుకుంది. ఆ ఎంప్లాయ్ ఏంటి మేడం పిలిచిన పలకట్లేదు అంది. తను ఎదో ఆలోచిస్తూ ఉండిపోయాను మేడం అనింది. సరే మీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగింది ఆ ఎంప్లాయ్. తన చేతి సంచిలో నుండి బ్యాంకు పత్రాలను తీసి ఆమెకు ఇచ్చింది. వాటిని తీసుకుని ఆ ఎంప్లాయ్ ఫామ్ ఫిల్ చేస్తూ ఉంది. అప్పుడు ఆ ఎంప్లాయ్ తో ఏదో అడుగుదామని తను ముందుకొరిగింది. కానీ పక్కనే ఉన్న ఇంకో ఎంప్లాయ్ అదోరకంగా చూసేసరికి వెనక్కి తగ్గింది. అది గమనించిన అమ్మాయి ఏంటి మేడం ఏమైనా అడగాలా అంది. తను అవునండి ఓ చిన్న అనుమానం ఉంది, కానీ అది ఎలా అడగాలో అర్థం కావట్లేదు అంది. ఆ ఎంప్లాయ్ మామూలుగానే అడగండి అంది. అప్పుడు తను మేడం డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత నాకేమైనా అయితే, ఆ వచ్చే డబ్బుని మా ఇంట్లో వాళ్లకు ఇస్తారా ఇవ్వరా? అంది అని అడిగింది. అది విని ఆ ఎంప్లాయ్ ఇస్తాం మేడం ఎందుకు ఇవ్వమండి అంది. తను అదేనండి ఇస్తారో ఇవ్వరో అని అనుమానం కలిగింది అంతే అంది. మీరేం బాధపడకండి మేము ఇస్తాం అయినా ఆ అనుమానం మీకెందుకండీ అడిగింది. తను నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా బాగుండడం లేదండి. నాకు ఒక 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. నాకేమైనా అయితే తనకు ఎవరూ లేరు అందుకే ఇలా డబ్బులు పెట్టడం మంచిదేనా కాదా అని ఆలోచిస్తున్నాను. అది విని ఎంప్లాయ్ మీరేం బాధపడకండి మీకేం కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ప్రస్తుతం లో జరిగే ఆనందాలను మిస్. మన పని మనం చేసుకుంటూ పోవాలి, తర్వాత ఏం జరుగుతుందో అనేది మన చేతిలో ఉండదు. నా మాట విని ధైర్యంగా ఉండండి. మళ్లీ మీరు వచ్చేసరికి మీ చేతిలో డబ్బు పెట్టే బాధ్యత నాది, ఇంకా మీరు వేరే నెగిటివ్ ఆలోచనలు ఏమిటి పెట్టుకోకండి అని అంది. సరే అండి అని తను ఆ ఎంప్లాయ్ చెప్పినట్టుగా డబ్బులు డిపాజిట్ చేసి ఇంటికి బయలుదేరింది. నడుస్తూ వెళుతుంది తన మనసులో ఏవేవో ఊహలు మెదలుతున్నాయి అవి:
నాలుగు సంవత్సరాలు తర్వాత వచ్చే డబ్బుతో ఓ మంచి ఇల్లు కట్టిస్తాను. శివని మళ్లీ బడికి పంపిస్తాను. శివ స్కూలుకు వెళ్లడానికి ఓ చిన్న స్కూటీని, ఇంట్లో ఉన్నప్పుడు అతను చూడటానికి ఒక టీవీని కూడా కొంటాను. ఇన్నాళ్లు అతను పడుకునే మంచాన్ని తీసేసి, ఓ పెద్ద మంచాన్ని తనకోసం కొంటాను. అని అతని గురించి ఆలోచించుకుంటూ వెళుతూ ఇంటిని చేరుకుంది.
తర్వాత రోజు తనకు దగ్గు, జ్వరం వచ్చేసరికి, శివ వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ముందులాగా పట్నాయక్ డాక్టర్ దగ్గర కాకుండా వేరే దగ్గరికి తీసుకువెళ్లాడు. డాక్టర్లు ఆమెకు టెస్టులు చేసి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తనతో మాట్లాడటానికి లోనికి పిలిచాడు. ఆమె డాక్టర్ కేబిన్ లోకి వెళ్ళింది. శివ కేబిన్ బయట కూర్చుని ఉన్నాడు. డాక్టర్ ఆమెతో మీరు ఏం పని చేస్తుంటారు అన్నాడు. తను కొంచెం నామోషీగా ఫీల్ అవుతూ.. వేరే వాళ్ళ ఇంట్లో వంట పనికి గిన్నెలు తోమటానికి వెళుతుంటాను అండి అంది. ఇంకా ఏమైనా పనులు చేస్తారా, నా ఉద్దేశం ఫ్యాక్టరీలలో గాని గనుల దగ్గర గాని అన్నాడు డాక్టర్. ఆ... ఓ సంవత్సరం ముందు దాకా ఊరవతల ఉన్న బొగ్గు గనిలో పనిచేసే దాన్ని సార్. కానీ ఆరోగ్యం సరిగా బాగోలేక మానేశాను అంది. అది విని డాక్టర్ మేడం మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ చెప్పడం డాక్టర్ గాని బాధ్యత అందుకే చెప్తున్నాను. మీకు లంగ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్. ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా ఆపరేషన్ చేయాలి లేకపోతే.... అన్నాడు. అది విని ఆమెకు నోట మాట రాలేదు, ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. డాక్టర్ కలుగ జేసుకుని మీకు ఆపరేషన్ చేయాలి దానికి సుమారు పది లక్షలు దాక ఖర్చవుతుంది అన్నాడు. అదివిని తను నిశ్చేస్టురాలై ఉండిపోయింది. అప్పుడు డాక్టర్ మీరు తొందరగా డబ్బు కట్టేస్తే తొందరగా ఆపరేషన్ చేసేద్దాం అన్నాడు. ఆమె సార్ ప్లీజ్ సార్ మాలాంటి పేదవాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుంది. మీరే ఏమైనా పెద్ద మనసుతో ఇంకో మాట చెప్పండి అంది బ్రతిమలాడుతూ. డాక్టర్ "చూడమ్మా ఆపరేషన్ జరగాలంటే మా కన్నా పెద్ద డాక్టర్లు రావాలి, కాబట్టి అర్థం చేసుకుని ఇక్కడి నుండి బయల్దేరు, అయినా రెండో మాట మూడో మాట చెప్పడానికి ఇది చేపల మార్కెట్ కాదు అన్నాడు. ఆమె " ప్లీజ్ సార్ మా పేదరికం అర్థం చేసుకొని మాకు కొంత సాయం చేయండి అంది. ఈ విషయంలో నేను నీకు ఏమి సహాయం చేయలేం అమ్మ సారీ అన్నారు డాక్టర్. తను ఇంకా ఏదో చెప్పబోతుంటే నర్సుని అని పిలిపించి తనను బయటకు పంపించేశాడు. అయినా ఆ నర్సుని నెట్టుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది, కానీ బయట ఉన్న శివ వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసి ఆగిపోయింది. ఏమైందమ్మా అన్నాడు శివ. ఏమీ లేదురా అంది వాళ్ళమ్మ. మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. తన కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏదో నలక పడినట్టుంది అందుకే అనింది. తర్వాత పదా ఇంటికి పోదాం అని శివ చేయిని పట్టుకుని ఇంటికి బయలుదేరింది.
ఇంట్లోకి వెళ్లాక వాళ్ళ అమ్మను పడుకోబెట్టి, అతను తాను పనిచేస్తున్న గని దగ్గరికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి తన మేనేజర్ ని కలుసుకున్నాడు. అతను ఏం శివ ఈరోజు పనికి రావడం మానేశావే అని అడిగాడు. అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు అన్న అన్నాడు. అవునా ఇప్పుడు ఎలా ఉంది తనకు అడిగాడు మేనేజర్. ఆ విషయమై నీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు శివ. అలాగా ఏంది విషయం అన్నాడు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అని హాస్పిటల్ కు తీసుకుపోయాను అన్న. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి క్యాన్సర్ అని అన్నారు. దానికోసం పది లక్షలు అడుగుతున్నారు అన్నాడు చేతులు నలుపుకుంటూ. మేనేజర్ కు విషయం అంతా అర్థమైంది. చూడు శివ నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే అన్నాడు.... ప్లీజ్ అన్న 10 లక్షలు అక్కర్లేదు కనీసం ఏడు లక్షలు అయినా ఇవ్వు అన్నాడు. అప్పుడు మేనేజర్ ప్రస్తుతానికి నా దగ్గరకూడా డబ్బులు లేవురా ఓ రెండు మూడు లక్షల అంటే... అన్నాడు. ఆ సమాధానం విని శివ మనుసులో నుండి దుఃఖం తన్నుకువచ్చింది. అన్న ప్లీజ్ అన్న కావాలంటే ఏడు లక్షలు తీరేదాకా నీ దగ్గర ఉండి నువ్వేం చెప్తే అది చేస్తాను. ఎంతసేపు పనిచేయమంటే అంతసేపు చేస్తాను అన్నాడు. నువ్వు చేస్తావని నాకు తెలుసులేరా కానీ అన్నాడు మేనేజ్ మేనేజర్.
అప్పుడు శివ ఏందన్నా వీడు కూలోడు వీడికి ఇస్తే తిరిగి ఇస్తాడో లేదో అన్న అనుమానంతో ఇవ్వట్లేదా లేక నిజంగానే డబ్బులు లేవా అన్నాడు. అది విని ఆ మేనేజర్ చూడు శివ మొదట్లో నువ్వు మీ అమ్మ బదులుగా ఇక్కడ పనికి వచ్చినప్పుడు. అందరూ నీకు వయసు తక్కువ అని నీవలన పని చేతకాదు అని అంటుంటే. నీ పరిస్థితిని నీ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని నీకు పని ఇచ్చింది నేను. నెల నెలా ఇవ్వాల్సిన జీతం నీ కుటుంబ పరిస్థితి వల్ల నీకు ప్రతి వారానికే ఇచ్చే నన్ను పట్టుకుని నువ్వు ఇలా అనడం మంచిదేనా అని అడిగాడు. దానికి శివ కొంచెంసేపు ఆలోచించి, సారీ అన్న డబ్బు లేకపోతే అమ్మకు ఏదైనా అయిపోతుందదేమో అన్న బాధలో ఏదేదో అనేసాను అన్నాడు. దానికి ఆ మేనేజర్ శివ భుజం మీద చేయి వేసి పర్లేదులేరా అని, నమ్మరా నా దగ్గర కూడా అంత డబ్బు లేదు ఒక రెండు మూడు లక్షలు అంటే ఇవ్వగలను. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడుగు అన్నాడు. దానికి శివ నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరూ లేరన్న అందుకే నీ దగ్గర ఆగిపోయాను అన్నాడు. అలా అక్కడి నుండి వట్టి చేతులతో బయలుదేరిన శివ, ఏం చేయాలో తెలీక నడుస్తూ నడుస్తూ సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో సాయంత్రం కావడంతో వేగంగా చల్లనిగాలి వీచింది. ఆ గాలికి అతని కంట్లో అప్పటివరకు తిరుగుతున్న కన్నీరు అతని అరికాళ్ళ మీద పడింది. ఇంతలో దూరం నుండి ఓ సముద్ర కెరటం వచ్చి ఆ కన్నీరుని తనలో కలిపేసుకుంది. ఆ కన్నీరు కొట్టుకుపోయినా దాని నుండి వచ్చిన సెగ ఇంకా శివకు తగులుతూనే ఉంది. అది చూసిన శివకు మనసులో ఏదో ఆలోచన మిదిలింది. వెంటనే లేచి నడక అందుకున్నాడు, అదికాస్త పరుగయింది.
మిగతా భాగం త్వరలో...
Part One : అమ్మా...ఓ జ్ఞాపకం volume- 1
Part Two : జ్ఞాపకాలు volume -2
Part four:- volume 4
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి