- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఈరోజు ఏం కథ రాయాలో తెలీక నిశ్శబ్దంగా కూర్చుని, యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక షార్ట్ వీడియో కనిపించింది. థమ్నైల్ లో ఆచార్య మూవీ ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అని ఉంది. దానికి కారణం నాకు తెలిసినా, అతను ఏం చెప్తాడో అని దానిని క్లిక్ చేశా. అతను ఇలా చెప్పడం మొదలెట్టాడు. హలో ఫ్రెండ్స్ మీరందరూ ఆశ్చర్య మూవీ చూసే ఉంటారు కదా, ఆ మూవీ ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్తా వినండి. అని ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ పాదఘట్టం, పాదఘట్టం అని చెప్పే సీన్స్ అన్నీ కట్ చేసి ప్లే చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ పాదఘట్టమే దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి అన్నాడు. దానికి వేరే వాళ్ళు ఏమని కామెంట్ పెట్టి ఉంటారో అని కామెంట్ బాక్స్ ఓపెన్ చేశాను. అక్కడ నాకు ఒక ఆణిముత్యం లాంటి కామెంట్ కనిపించింది. అది చదివాక నవ్వాగలేదు, పడి పడి నవ్వాననుకోండి. ఆ కామెంట్ పాదఘట్టం, పొగగొట్టం, పశువుల కొట్టం అని సినిమాని నేలమట్టం చేశారు కదరా...
ఒకసారి మా మామయ్య, అత్తయ్యని ఆఫీసులో దింపేసి వస్తూ ఉన్నాడు. అత్తగారేమో మళ్లీ మామయ్యని వెనక్కి పిలిచి "మాయ ఈరోజు ఆఫీస్ మధ్యాహ్నం వరకే ఉంటుందంట" అంది. మామయ్య "ఏం మధ్యాహ్నం తర్వాత ఆఫీసు కూల్చేస్తారా" అన్నారు నవ్వుతూ. అత్తయ్య విసుక్కుని అది కాదు ఈరోజు వర్క్ మధ్యాహ్నం వరకే ఉంటుంది, మళ్లీ మధ్యాహ్నం నన్ను తీసుకువెళ్లడానికి రావా! అంది. సరే అని చెప్పి మామయ్య ఇంటికి వచ్చేసాడు. మామయ్య వచ్చేసిన చాలాసేపటికి మేనేజర్ ఆఫీసుకు వచ్చి, అత్తయ్య వాళ్ళకి "ఈరోజు ఆఫీస్ కు సెలవు పెట్టేయండి అందరూ ఇళ్లకు వెళ్లిపోండి" అని చెప్పాడు. చేసేదేం లేక బస్టాండుకు నడక మొదలు పెట్టారు అందరూ. బస్టాండుకు, ఆఫీసుకు మధ్యలో సినిమా ధియేటర్ ఉంటుంది. వాళ్లు అలా నడుచుకుంటూ వెళ్తుండగా థియేటర్ కనిపించింది. థియేటర్ బయట అప్పుడే టికెట్లు ఇస్తూ ఉన్నారు. అప్పుడు మా అత్త వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకావిడ మిగతా వారితో మామూలుగా సినిమాకు వెళ్దామా అని అడిగింది. ఆ మామూలుగా అన్న మాటే చివరికి నిజమైంది. అందరూ సినిమాకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు మా అత్తయ్య ని కూడా ఒసేయ్ రావే సినిమాకు వెళ్దాం అన్నారు. దానికి మా అత్తయ్య కొంచెం ఆలోచిస్తూ ఉండగా. ఏం పర్లేదులే రావే, ఎలాగో మీ ఆయన మధ్యాహ్నానికి వస్తారు కదా, అంతలోపు సినిమా అయిపోద్దిలే అన్నారు. ఫ్రెండ్స్ తోనే కదా అనుకుని సరే అని వెళ్ళింది. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా ఖైదీ నెంబర్ 150. అలా సినిమా చూస్తూ ఉన్నారు. సినిమా క్లైమాక్స్ కు వస్తూవుంది, ఇంతలో మా మామయ్య ఫోన్ చేశాడు. మా అత్తయ్య ఫోన్ ఎత్తగానే " హలో ఆ... చిన్న వర్క్ అయిపోయిందా " అన్నాడు. మా అత్తయ్య " లేదు మాయ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తానులే " అని కట్ చేసింది. కానీ మామయ్యకి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే చిరంజీవి డైలాగులు వినిపించేసాయి. తర్వాత అతను బండి పట్టుకొని వచ్చి రెడీగా థియేటర్ ముందు పార్క్ చేసి, ఓ పల్లి పొట్లం కొనుక్కుని కూర్చుని తింటూ ఉన్నాడు. ఓ పావు గంట తర్వాత సినిమా అయిపోయి, అందరూ బయటకు వస్తువున్నారు. అప్పుడు మామయ్య అత్తయ్య ని చూసి, తింటున్న పొట్లాని పక్కకు పెట్టి. సెల్ తీసుకుని ఫోన్ చేశాడు. తను ఫోన్ ఎత్తి " ఆ మాయ చెప్పు అంది ". అతను " మీటింగ్ అయిపోయిందా " అన్నాడు. తను " అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చి నడుస్తూ ఉన్నాం, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను నువ్వే చేసేసావు అంది. అప్పుడు మామయ్య అవునా... ఎవరు వచ్చారు మీటింగ్ కి చిరంజీవా? అన్నాడు నవ్వుతూ. దానికి తను ఆశ్చర్యంతో నవ్వుతూ ...ఈయన ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకుని చుట్టూ చూసింది. చూస్తే ఎదురుగానే ఉన్నాడాయన. అది తలచుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారిద్దరూ...
మీరు కూడా నవ్వుతారు అని ఓ చిరు ప్రయత్నం ఈ చిన్న కథలు. ఇది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా మన KIDDISTORY'S లో ఉన్నాయి చెక్ చేసి చూడండి కృతజ్ఞతలు. .
మళ్ళీ ఇంకో కథతో త్వరలోనే కలుసుకుందాం.
ఇట్లు మీ
చరణ్....
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి