- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
తర్వాత రోజు క్రొమిటస్ తన క్రూ వైపు తిరిగి, మిత్రులారా ఈరోజు మనం చేయబోయే ఈ ప్రయాణం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఈ నిధి కోసం మనకంటే ముందు ఎంతోమంది ప్రయత్నించారని తెలుసు. వారెవరికి ఆ నిధి దక్కలేదని తెలుసు. ఎందుకంటే వారందరూ చేతకాని దద్దమ్మలు. మనం కూడా వారిలో ఒకరు కాకూడదు అనుకుంటే ఈ ప్రయాణంలో మన కాళ్లు విరిగిన ప్రయాణం ఆపవద్దు. చేతులు విరిగిన యుద్ధం ఆపవద్దు. ప్రాణం పోయినా ఆశయం మాత్రం బ్రతికే ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే మనలో చివరి ప్రాణం కొన ఊపిరితో ఉన్నంతవరకు. ఎండా, వాన, చలి ఇలాంటి ఆటంకాలన్ని మనకే తప్ప, మన ఆశయానికి కాదు అని నిరూపిద్దాం. సముద్రపు దొంగలుగా పుట్టాము అలాగే చచ్చిపోదాం. దీనికి మీరు ఏమంటారు అని అడిగాడు. దానికి వారందరూ అవును.. అవును.. అని గట్టిగా ఆ అరుపు ఎలా ఉందంటే, మేఘాల మధ్యలో నుండి వచ్చే ఉరుములా ఉంది. వాళ్ల సమాధానం విని అతను సంతోషించి, మెరుపు వేగంతో పడవని తూర్పు దిక్కున పోనివ్వసాగాడు. రోజులు గడుస్తున్నాయి దారిలో వారికి వందల కొద్ది పడవలు, గత శతాబ్దాలుగా నిధి కోసం ప్రయత్నించినవి కనిపించాయి. అందులో ఈ మధ్యకాలంలో వచ్చినవి కూడా ఉన్నాయి. వాటి నిండా గుట్టల కొద్ది అస్తిపంజరాలు ఉన్నాయి. వాటిని చూస్తూ వెళుతున్నారు. ఆ సైనికులకు అప్పుడు అర్థమైంది తమ కెప్టెన్ ఎందుకు నౌక నిండా పళ్ళతో నింపమన్నాడో. ఎందుకంటే వెళ్లే దారిలో అత్యంత భయంకరమైన చావుని చవిచూడాలి అని వారికి తెలుసు, కాని అది ఏంటో తెలీదు. అది ఆకలి అని అప్పుడు అర్థమైంది వాళ్ళకి. మొదటిసారి బ్రిటిష్ నౌకలో ప్రవేశించిన క్రొమిటస్ కు అక్కడ ఐదుగురు చనిపోవడం. వాళ్ల శరీరాల మీద గాయాలు ఉండడం, పడవ క్రిందన అస్తిపంజరాలు ఉండడం చూసి అనుమానం కలిగింది. ఉంటే అన్ని అస్తిపంజరాలు ఉండాలి, లేకపోతే అన్ని శవాలైన ఉండాలి. కాని కొన్ని శవాలు, కొన్ని అస్తిపంజరాలు ఉండడం చూసి అనుమానం కలిగింది. తర్వాత అతను ఒక అవగాహనకు వచ్చాడు. పడవలో ఆహారం సరిపోక ఒక్కొక్కరిని చంపి తినడం మొదలెట్టారు. చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురు ఇంకొక్కడిని చంపి తిందామని పథకం పన్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ నలుగురు కూడా చనిపోయారు. అందుకే అలాంటి సంఘటన తమ దగ్గర కూడా జరగకూడదు అనుకుని, క్రొమిటస్ నౌక మొత్తం పళ్ళతో నింపించేశాడు. కానీ ఎంత పథకం పనిన ఉపయోగం లేకపోయింది, తమ దగ్గర ఉన్న ఆహారం రోజు రోజుకి అయిపోవసాగింది. ఇలా అయితే కష్టం అనుకుని మళ్ళీ నౌకను వెనుకకు పోనిచ్చాడు క్రొమిటస్.
ఏం జరుగుతుందో అర్ధంకాక తన క్రూ మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ వుంది. క్రొమిటస్ తన పదవని వెనక్కు పోనిచ్చి, వఛ్చిన దారిలో తమకు కనిపించిన పడవల దగ్గరికి వెళ్ళాడు. అందులో ఈ మధ్యకాలంలో వచ్చినవి కూడా ఉన్నాయని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. వాటన్నిటిని తీసుకురండని తన సైనికులని ఆదేశించాడు. అలాగె ప్రతి నౌకలో ఏడుగురు ఉండండని చెప్పాడు. తన క్రూ మొత్తం సముద్రంలోకి దూకి అక్కడ వున్న వందల పడవల్లో కొన్నింటిని తీసుకున్నారు. తమ కెప్టెన్ చెప్పినట్లుగానే ప్రతి పడవలో ఏడుగురు సర్దుకున్నారు. తర్వాత క్రొమిటస్ వాళ్ళందరిని డెత్ ఐలాండ్ వైపు ప్రయాణం మొదలెట్టండి అని ఆదేశించాడు. మొదట్లో ఒక్కటిగా ఉండిన నౌక ఇప్పుడు పద్నాలుగు అవ్వింది. ప్రతి పడవలో ఏడుగురు చొప్పున తొంబై ఎనిమిది మంది ప్రయాణించారు. డెత్ ఐలాండ్ ని చేరుకున్నాక క్రొమిటస్ వాళ్ళందరితో మిత్రులారా ముందులాగే నౌకలన్నీ పళ్ళతో నింపేయండి అన్నాడు. ఆ పడవలన్నీ పళ్ళతో నింపడానికి వాళ్ళకి ఓ నాలుగురోజుల సమయం పట్టింది. తర్వాత మళ్ళీ ఆ నిధి కోసం ప్రయాణం మొదలెట్టారు. పట్టుకెళ్లే ఆహారం ఏడుగురికి కనీసం ఒక మూడు నెలలైన వస్తుందని అతని అభిప్రాయం. అలా అనుకొని పద్నాలుగు పడవలతో బయలుదేరాడు అతను. ఈ సారి మాత్రం ముందుకన్నా ఉత్సాహంగా, కచ్చితంగా నిధితోనే తిరిగివస్తాం అన్న నమ్మకంతో ప్రయాణిస్తూ వున్నారు.
మూడున్నర మాసాల తర్వాత: -
ఆహారం అయిపోయి రెండు వారాలు గడిచింది. పగలు విపరీతమైన ఎండ, రాత్రయితే ఎముకలు కొరికే చలి. ఒకవైపు ఆకలి, దాహం చంపేస్తోంది. తాగటానికి ఒక్కచుక్క నీరు కూడ లేదు. ఆకలి దప్పికలకు తాలలేక ఒక్కొక్కరిగా దానికి బలైపోయారు. చివరికి ఒక్కొక్క నౌకలో ముగ్గురికి మించి ఎక్కువ మంది బ్రతికిలేరు. అయినా వారు ప్రయాణం ఆపలేదు. వెనక్కి వెళ్ళిపోవాలని వున్న ఆడిన మాటకు కట్టుబడి ప్రయాణం చేస్తూ వున్నారు. అలా ఇంకో ముడు రోజులు గడిచింది. అయినా వారికి ఆ నిధి ఉండే చోటు కనిపించలేదు. దాంతో ఒక్కొక్కరిలో మెల్లిగా నిరాస పెరుగుతూ వచ్చింది, వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకొక్క రోజు ఆగి, మనం దానిని చేరుకోలేక పోతే క్రొమిటస్ కు చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అది ఏదో విధంగా క్రొమిటోస్ కు తెలిసింది క్రొమిటస్ కు తెలుసు వెనక్కి వెళ్లిన చచ్చిపోతామని. అందుకే అతను ఆ నిధి సాధించడం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బలంగా నిలదొక్కుకుని ఉన్నాడు. ఆ రోజు కూడా గడిచింది కానీ వారు చేరుకోలేదు. వెనక్కి వెళ్లిన చనిపోతామని వారికి కూడా అర్థమైంది కాబోలు, ఏం చేయలేక క్రొమిటస్ ను అనుసరిస్తూ ఉన్నారు. క్రొమిటస్ మనసు దృఢంగానే ఉన్న నిద్ర, ఆహారం లేకపోవడం వల్ల శారీరకంగా బలహీనమైపోయాడు. కళ్ళు మెల్లిగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. శరీరం ఎముకలు బారిపోతుంది. దాదాపు అక్కడ అందరు పరిస్థితి అలాగే ఉంది. నిల్చడానికి కూడా ఓపిక లేక అలాగే పడుకుని పోయాడు. రాత్రి సముద్రపు గాలి చల్లగా వీస్తూవుంది అంతసేపు కనిపిస్తున్న నక్షత్రాలు కొద్దికొద్దిగా కనిపించడం మానేశాయి. కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయేమో, బహుశా ఇదే తన చివరి రోజేమో అనుకున్నాడు.
ఆ క్షణం కూడా అతనికి వెనక్కి వెళ్లాలని అనిపించలేదు. సముద్రపు దొంగగా ఇన్నాళ్లు ఉన్నాను అలాగే చావాలి అనుకున్నాడు. కళ్ళు మెల్లగా మూసుకుపోతున్నాయి అతనికి. ఇంతలో ఆకాశం పెద్దగా ఉరిమింది. ఆ ఉరుము శబ్దానికి తుళ్లిపడి లేచి ఆకాశం వైపు చూశారంతా..ఆకాశం మొత్తం కారు మేఘాలతో కమేస్తోంది. తర్వాత కొంతసేపటికి ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడసాగింది. ఆ వర్షం నీటిని దోసిల్లలో పట్టుకుని తాగారు అందరూ. ఇన్నాళ్లు హతాశయులైన వారి శరీరాలకు మళ్ళీ ఒక్కసారి జీవం వచ్చినట్లయింది. మళ్లీ శక్తి పుంజుకున్నాక గట్టిగా అరుస్తూ.. పడవలను పోనివ్వసాగారు. వీచే భీకరమైన గాలులకి పడవలు వేగంగా కదులుతున్నాయి. ఇంతలో ఓ పెద్ద కెరటం ఎదురుగా వచ్చి వారి పడవలను ఢీకొంది, దాని దెబ్బకి వాళ్లు అక్కడ ఉన్న వాటికి గుద్దుకొని సృహ కోల్పోయారు. ఆ భీకరమైన గాలులు, భయంకరమైన సముద్ర కెరటాలు ఆ పడవల్ని ఒక వైపుకి తోసుకు పోయింది. సూర్యుని కిరణాలు వేడిగా తగలడంతో స్పృహ వచ్చింది అందరికీ. కళ్ళు తెరచి చూస్తే వాళ్లు ఒక ద్వీపం మీద ఉన్నారని అర్థమైంది. అక్కడ ఉన్న టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు సూర్యుని కిరణాలు తగిలి అంతకంటే ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళు సాధించారని. అప్పుడు వారు నవ్వుతూ వెనక్కి తలతిప్పి చూశారు చూశారు THE END కార్డు పడింది.
ఆ మ్యాప్ లో కిందన వున్న
Ακόμα κι αν όλος ο κόσμος γυρίσει ανάποδα, μόνο ο ήρωας που δεν κοιτάζει ποτέ πίσω μπορεί να το πάρει.
దానికి అర్ధం ప్రపంచం తల క్రిందులైన వెన్నుచూపని వీరుడు మాత్రమే దాన్ని పొందగలడు.
మొదటి భాగాన్ని చదవండి : cromitos - the hell of atlantic
మరిన్ని కధలు మీ కోసం లో ఎదురు చూస్తున్నాయి. వెతికి చూడండీ..
మరిన్ని కధలతో ముందు ముందు కలుసుకుందాం. .అప్పటి వరకు సెలవు.
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి