మేలుకున్న మానవత్వం - small moral story

బ్రాహ్మణ భోజనం - తెలుగు కథలు

 

Image of telugu funny stories

ఒకసారి శర్మ అనే పండితుడు, తన మిత్రుడైన కుర్మా దగ్గరికి వెళ్ళాడు. కుర్మా తన మిత్రుడిని ప్రేమతో ఆహ్వానించి, అతిధి సత్కారాలు చేశాడు. తర్వాత వారు అలా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో మధ్యాహ్నం కావడంతో కుర్మా తన శిష్యులకు చెప్పి భోజనం ఏర్పాట్లు చేశాడు. కుర్మా శిష్యులు భోజనాలను సిద్ధం చేశారు. తన శిష్యులకు భోజనాలు వడ్డించమని చెప్పి అతను కూర్చోకుండా నిల్చునే ఉన్నాడు. తన మిత్రుడైన శర్మ చేతులు కడుక్కుని వచ్చి ఏమైందిరా దా కూర్చుందాం అన్నాడు. అప్పుడు కుర్మా "మిత్రమా అప్పుడే కూర్చోవద్దు అన్నాడు". శర్మ అతని మాటలు పట్టించుకోకుండా రాయెహే...ఆకలి అవుతుంటే అని చాప మీద కూర్చున్నాడు. ఇంతలో ఓ శిష్యుడు పెద్ద పల్లెరంలో అన్నాన్ని పరుగు పరుగున తీసుకువస్తూ ఉన్నాడు. అది చూసి శర్మ హమ్మయా త్వరగానే తెస్తున్నాడు అనుకున్నాడు. ఆ శిష్యుడు అన్నాన్ని తెచ్చి వేగంగా శర్మగారి ముందు పెట్టేసి వెళ్లిపోయాడు.  ఆ శిష్యుడు అలా వేగంగా పెట్టేసరికి ఆ పల్లేరంలో ఉన్న అన్నం కాస్త శర్మగారి మీదికి వొలికింది. అప్పుడు శర్మ" కాస్త చూసుకో నాయనా అన్నం వొలికి పోతుంది", అని ఆ శిష్యుడితో చెబుదాం అనుకున్నాడు. కాని ఎదురుగా చూస్తే శిష్యుడు కనిపించలేదు. సరేలే అనుకుని తన మీద పడిన అన్నాన్ని చేతితో దులుపుకున్నాడు. తర్వాత ఇంకొంత సేపటికి మరో శిష్యుడు వేగంగా వచ్చి పెద్ద కంచంలో వడియాలు, గారెలు, అప్పడాలు తెచ్చి గబాల్న పెట్టేసి వెళ్లిపోయాడు. అతను అలా పెట్టగానే ఆ గిన్నెలో ఉన్న గారెలు, వడియాలు ఎగిరి ఆ బ్రాహ్మణుడి గుండు మీద పడింది. కనీసం ఈ శిష్యుడుతోనైనా బాబు కొంచెం నిదానం అని చెబుదామనుకున్నాడు. కానీ చెప్పేలోగా ఈ శిష్యుడు కూడా మాయమైపోయాడు. ఇంకొంత సేపటికి మరో శిష్యుడు కూడా అలాగే వేగంగా వస్తూ ఉన్నాడు. పెద్ద రేకులాంటి పాత్రలో ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, వంకాయ కూర, పులిహోర తెస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా అలా వేగంగా నడుస్తూ వచ్చేసరికి శర్మ అతని వంక కోపంగా చూశాడు. ఆయన అలా చూసేసరికి ఆ శిష్యుడు కొంచెం భయపడి, తాను తెచ్చిన దాన్ని నేల మీద పెట్టకుండానే వదిలేశాడు. దాంతో అక్కడ ఉన్నవన్నీ లేచి ఆ శర్మ గారి బట్టల మీద పడిపోయింది. ఎప్పుడు శాంతమూర్తికి నిదర్శనంగా ఉండే ఆయన దుస్తులు పండగలో పూలరంగడు వలె తయారయింది. ఆయన చిరాకుతో అరే శుంఠా! చూసుకోరా అని అరిచాడు. కానీ చెప్పేదేముంది మళ్లీ సేమ్ సీన్ రిపీట్. కనిపించకుండా, వినిపించుకోకుండా పారిపోయాడు ఆ శిష్యుడు. అప్పుడు శర్మ గారు కోపంతో ఊగిపోతూ తన కండువాని నేల మీద కొట్టి తన మిత్రుడు కుర్మాతో అరే ఏంట్రా ఇది అన్నాడు. అంతసేపు లోలోపలే నవ్వుతూ ఉండిన కుర్మా కొంచెం నవ్వాపుకుని. చెప్పాను కదా మిత్రమా ముందే కూర్చోవద్దని చూడు ఇప్పుడు ఏమయిందో అన్నాడు. అది విని శర్మ అసలు నేను అడిగేదేంటీ నువ్వు చెప్పేదేంటి, వీరు ఎందుకలా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా లేక నువ్వే కావాలని చేయిస్తున్నావా అని అడిగాడు కోపంగా. అప్పుడు కుర్మా ఏం చెప్పమంటావు మిత్రమా నేను పాఠాలు చెప్తే వారి జీవితాలు మారుతాయి అనుకున్నాను. కానీ వాళ్లతో పాటుగా నా జీవితాన్ని కూడా మార్చేస్తుంది అని గ్రహించలేకపోయాను అన్నాడు. శర్మ "పాఠమా ఏం పాఠం చెప్పావు అన్నాడు. కుర్మా ” పాఠం అంటే మరీ పెద్దదేమి కాదు మిత్రమా రెండు వాక్యాలు అంతే. అది ” జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది అందులో మనం గెలవాలంటే ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చిన పరిగెడుతూనే ఉండాలి అన్నాను. అప్పటినుండి వారు పరిగెడుతూనే ఉన్నారు అన్నాడు అమాయకంగా. అది విని శర్మ "మరి అదంతా అబద్ధం జీవితంలో నిదానమే ప్రధానమని ఇంకో పాఠం చెప్పొచ్చుగా అన్నాడు". వాళ్లు ఒక్క నిమిషం అయినా ఆగితే కదా మిత్రమా దయ్యాల్ల మాయమైపోతున్నారు, భూతాల్లా కనిపిస్తున్నారు అన్నాడు. అప్పుడు శర్మ నీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మిత్రమా అని, లేచి కుర్మా కి ఏదైనా సలహా ఇద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలో ఇంకో శిష్యుడు వేడిగా ఉన్న సాంబారుని పెద్ద పాత్రలో వేగంగా పట్టుకుని వస్తున్నాడు. శర్మ అది చూసి మిత్రమా అదేంటి అలా పొగలు వస్తున్నాయి అన్నాడు. అప్పుడు కుర్మా బ్రాహ్మణ భోజనంలో అన్ని వచ్చేసాక ఇంకా ఏముంటుంది సాంబారే అన్నాడు. అప్పుడు శర్మ తన కండువాన్ని తీసుకుని, పంచె ఎత్తుకుని " మిత్రమా ఈరోజుతో నీకు మిత్రుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపో. ఇంకెప్పుడు నన్ను మళ్ళీ భోజనానికి పిలవొద్దు. పరమానందయ్యా శిష్యులు గురించి వినడమే గాని చూడ్డం ఇదే మొదటిసారి అంటూ పారిపోయాడు. చివరిసారిగా మీకు చెప్పేది ఏమిటంటే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు జరిగాయి కానీ ఇదే మొదటిసారి "కాబట్టి నిదానమే ప్రధానం".

ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు....🥰
మరిన్ని ఆసక్తికర కధనాలతో మీ ముందుకు వస్తాము..సెలవు.

కామెంట్‌లు