నిజమే ఆయన గొప్పవారు

నా చావు నేను చస్తా నీకెందుకు - telugu funny story

 

Image of jokes

ఒకసారి నన్ను ఓ పెద్దాయన ఏం చేస్తుంటావు బాబు అని అడిగారు. నేను ఒక రైటర్ ని అవ్వాలని అనుకుంటున్నాను సార్ అన్నాను. అది విని ఆయన "అదేంటయ్యా ఇంత పొడుగ్గా ఉండి ఏ ఆర్మీ కో, పోలీస్ కో వెళ్లొచ్చు కదా. నేను నీలా ఎత్తు ఉండి ఉంటే అలాగే అవ్వే వాడిని అన్నాడు. అతను పొట్టిగా,నల్లగా భీముల్లాగా  దిట్టంగా బలంగా ఉంటారు లేండి. అప్పుడు నేను నా చావు నేను చస్తా నీకెందుకు అని గట్టిగా అరవకుండా మీరేం చేస్తుంటారు సార్ అని అడిగాను అతన్ని. ఏం చేస్తాములే అబ్బాయి, ఇదిగో ఈ పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ లో క్లర్క్ గా చేస్తుంటాను అన్నాడు ఆయన. నేను "అదేంటి గురువుగారు ఇంత దిట్టంగా ఉండే మీరు క్లర్కుగా చేస్తున్నారా, మీలా ఉంటే నేనైతే ఇండియాకి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్స్ తెచ్చేవాడిని. ఒకవేళ మెడల్స్ రాకపోతే, అక్కడ మెడల్స్ ఇచ్చే వారిని WWW లో కొట్టినట్లు కుర్చీలతో చితక్కొట్టి మరీ మెడల్స్ ని తీసుకునేవాడిని. తర్వాత మెడల్స్ ని తీసుకుని కెమెరామెన్ దగ్గరికి వెళ్తాను. ఎలాగో ఆ కెమెరామెన్ నన్ను చూసి ఓ మై గాడ్ అని కెమెరాల్ని వదిలేసి పారిపోతాడు. కెమెరా దగ్గరికి వెళ్లి ’కష్టపడండి ఫలితాన్ని సాధించుకోండి” అని నా అమూల్యమైన స్పీచ్ ని ఇచ్చి వచ్చేస్తాను అన్నాను. నా మాటలకు ఆ పెద్దాయన కొద్దిగా నవ్వి, ఏం చేస్తాములే కొందరికి కొన్ని ఆ దేవుడు రాసి పెట్టి ఉండడులే అన్నాడు. అప్పుడు నేను ”ఆ మాట  కోసమే మీకు ఇదంతా చెప్పానండి, నా జీవితంలో ఆర్మీ పోలీస్ లాంటివి రాసిపెట్టి లేవు” అన్నాను. నా మాటలు విని ఆ పెద్దాయన కొంచెం  సేపు ఆలోచించి సరేనయ్యా నీకు ఇష్టమైనది చెయ్ అని అన్నాడు. అతని దగ్గర సెలవు తీసుకుని నేను ఇంటికి బయలుదేరాను.


Thanks for reading.... See u soon.

కామెంట్‌లు