- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఒకానొక సమయంలో అట్లాంటిక్ సముద్రంలో ఒక దొంగల గుంపు తిరుగుతుండేది. ఆ గుంపును అందరూ హెల్ ఆఫ్ అట్లాంటిక్ అని పిలిచేవారు. అంటే అట్లాంటిక్ నరకం అని దాని అర్థం. ఆ గుంపుకు నాయకుడు క్రొమిటస్. క్రొమిటస్ అంటే వాళ్ళ భాషలో నరకానికి అధిపతి అని అర్ధం. పేరుకి తగ్గట్టుగానే అతను ఓ జాలి, దయ లేని క్రూరుడు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. తను కోరుకున్నది దక్కడానికి ఎందుకైనా తెగిస్తాడు. చిన్నపిల్లలు, ఆడవాళ్లు అయినా కూడా కనికరం చూపించడు. అతని దారికి అడ్డువస్తే వాళ్ళ ముందు ఉండేవి రెండే దార్లు పారిపోవాలి లేదా అతని చేతిలో చనిపోవాలి. అలాంటివాడు ఒకసారి తన బృందంతో ఒక నిధి అన్వేషణకై బయలుదేరాడు. క్రొమిటస్ కంటే ముందు ఎంతో మంది రాజులు ఆ నిధి కోసం ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరికి అది దొరకలేదు. దొరకలేదు అనేకంటే వారెవరు ప్రాణాలతో తిరిగి రాలేదు అనడం బాగుంటుందేమో. ఎందుకంటే ఆ నిధి కోసం వెళ్ళినవారు అత్యంత భయంకరమైన చావుని చవిచూడాల్సి వస్తుంది. చావుని కూడా గెలిచినవారు మాత్రమే ఆ నిధిని సాధించగలరు. అలాంటి నిధి కోసం బయలుదేరాడు అతను. తన దగ్గర ఉన్న ఓ మ్యాప్ ని చూస్తూ తన పడవని పోనిస్తూ ఉన్నాడు. మ్యాప్ అంటే మీరు క్లూస్ ఉంటాయి పజిల్స్ సాధించాలి అనుకోకండి. ఆ మ్యాప్ లో ఒక ప్రదేశం మాత్రమే ఖచ్చితంగా గుర్తించబడి ఉంది. అది సముద్రం ఏడు మహా సముద్రాలు కలిసి చోట ఒక దీవి ఉంటుంది. ఆ దీవి నుండి తూర్పు దిక్కుకు వెళితే మీకు నిధి కనిపిస్తుంది, అన్నట్టుగా గుర్తులు ఉన్నాయి. కానీ నిధి కచ్చితంగా ఎక్కడ ఉంటుందో అక్కడ గుర్తించబడి లేదు. కేవలం తూర్పుదిక్కుకు వెళ్ళండి అన్నట్టుగా ఉంది. ఆ మ్యాప్ అడుగు భాగంలో ప్రాచీన గ్రీకు భాషలో ఇలా ఏదో రాయబడి ఉంది .
Ακόμα κι αν όλος ο κόσμος γυρίσει ανάποδα, μόνο ο ήρωας που δεν κοιτάζει ποτέ πίσω μπορεί να το πάρει.
ఇధి చదివి అర్థం కాక ఏమైతేనేం అనుకుని బయలుదేరాడు. అతని ప్రయాణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిమిషాలు గంటలవ్వింది. గంటలు రోజులవ్వింది. రోజులు కాస్త వారాలవ్వింది. ఆ వారాలు కాస్త నెలలవ్వింది. అయినవారు ఆ ఏడు సముద్రాలు కలిసి చోటును చేరుకోలేదు, వారు ప్రయత్నం ఆపలేదు. ఒకరోజు ఉదయాన్నే ఒకడు పడవ మీదకి ఎక్కి అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులకి క్రోమీటస్ మరియు అతని బృందం మేల్కొంది. బయటకు వెళ్లి ఏమిటి అని అడిగాడు క్రొమిటస్. దానికి అతను బయటకు చూడమన్నట్టు సైగ చేశాడు. వాళ్లంతా సముద్రం వైపు చూశారు. బయటకు చూసిన వాళ్లకి తమ పడవ నుండి అల్లంత దూరాన ఇంకో పెద్ద నౌక కనిపించింది. అది చూసిన క్రొమిటస్ అతని సైన్యంతో ఆయుధాలను సిద్ధం చేయండి దాడి జరగబోతుంది అని ఆదేశించాడు. అతని ఆదేశాలను పాటిస్తూ అతని క్రూ మొత్తం ఆ పనిలో పడ్డారు. ఈరోజు వీరి పని పడదాం అని తన పడవని ఆ దిక్కుకు పోనిస్తూ ఉన్నాడు. కానీ అటువైపు ఉన్న పడవ నుండి ఏ చలనం కనిపించలేదు అతనికి. దాంతో తన పడవని ఇంకాస్త ముందుకు పోనిచ్చి ఆ పడవ దగ్గరికి చేరుకున్నారు. ఆ పడవలోకి వెళ్ళండి అన్నట్లు తన సైన్యాన్ని సైగ చేశాడు. తర్వాత తాను కూడా ఒక చిన్న రైఫిల్ ని తీసుకుని పడవలోకి వెళ్ళాడు. లోనికి ప్రవేశించిన తన సైనికులు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నారు. క్రొమిటస్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ ఐదుగురు విచ్చలవిడిగా పడిపోయి చనిపోయి ఉన్నారు. వారి ఒంటి మీద ఎవరో కొరికినట్లుగా, రక్కినట్లుగా గాయాలతో పాటు వారి శరీరం ఒకవైపు కుళ్లిపోయి ఉంది. అలా వాటిని చూస్తూ ఇంకాస్త ముందుకి కదసెలవు..
అతను. అందులో ఒకడు గోడకు ఆనుకుని చనిపోయి ఉన్నాడు. ఆ శవానికి ఉన్న వేషధారణను బట్టి అతనే ఆ నౌకకు కెప్టెన్ అని తెలుస్తుంది. ఆ శవాన్ని బాగా చూసి తన క్రూ వైపు తిరిగి వీడెవడో గుర్తున్నాడా మీకు అని అడిగాడు. వారు తెలీదు కెప్టెన్ అన్నారు. క్రొమిటస్ " ఐదేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం ఒకడిని "కార్గోమైల్ " అనే నౌకకు అధిపతిని చేసింది. సముద్రపు దొంగలు తమపై చేస్తున్న దాడులకు అతను అడ్డుకట్ట వేస్తాడని బ్రిటిష్ ప్రభుత్వం నమ్మింది. అతను కూడా సముద్రపు దొంగలు అందరినీ అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ముఖ్యంగా హెల్ ఆఫ్ అట్లాంటిక్ కి కెప్టెన్ అయిన నన్ను పట్టుకుంటానని ప్రగల్బాలు పలికాడు అన్నాడు. అది విని అప్పుడు తన సైన్యంలో ఒకడు గ్రూస్ ఆడమ్ స్మిత్ కెప్టెన్ అన్నాడు. అది విని ఆ........ ఆ చెత్త నా **** ఇదిగో వీడు అన్నాడు క్రొమిటస్. నన్ను పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని కూడ సిద్ధం చేశాడంట, తీరా చూస్తే అదే సైన్యాన్ని వేసుకుని ఆడంగిలాగ బంగారం వేటకి వచ్చాడు. అటు బంగారం పట్టుకోలేదు, ఇటు నన్ను పట్టుకోలేదు. అందుకే వీడిని చెత్త నా **** అనేది. లేకపోతే నన్ను పట్టుకుంటాడంట నన్ను... నన్ను... అని గట్టిగా నవ్వుతూ తన బూటుతో వాడి తలని తన్నాడు. ఆ తల ఎగిరి అల్లంత దూరాన పడింది. కొందరు నౌక కింది భాగానికి చేరుకున్న సైనికులు కెప్టెన్ అని అరిచారు . అది విని వాళ్లు కిందికి వెళ్లి చూస్తే అక్కడ గుట్టలు గుట్టలుగా పదుల సంఖ్యలు అస్తిపంజరాలు కనిపించాయి. అది చూసి క్రొమిటస్ కు ఒకటి అర్థం అయింది. తన క్రూలో ఒకరిని పిలిచి ఇంకా మనకు ఆహారం ఎన్ని రోజులు సరిపోవచ్చు అన్నాడు. వాడు మూడు రోజులు కెప్టెన్ అన్నాడు. అప్పుడు క్రొమిటస్ ” మిత్రులారా వీలయనంత త్వరగా మనం ఆ ద్వీపాన్ని చేరుకోవాలి, పదండి వేగంగా కదలండి అన్నాడు. అందరూ పడవ నుండి బయటకు వెళ్లారు. పడవలోకి చేరుకుని వేగంగా నడపసాగాడు. అలా రోజులు గడిచింది. ఉన్న మూడు రోజులు గడువు కాస్త ఐదు అవ్వింది. ముందుగా అనుకున్నట్టుగానే ఆహారం మూడు రోజులకు మించి సరిపోలేదు.
ఆరోజు రాత్రి ( ఉదయం కాబోతుంది) తన సైన్యం మొత్తం గాఢ నిద్రలో ఉన్నారు. క్రొమిటస్ మరియు అతనితో ఇంకో వ్యక్తి కూడా లేచి ఉన్నారు. ఆ రాతిరి ప్రయాణం నిశ్శబ్దంగా సాగుతోంది. తన దూరదర్శినితో నక్షత్రాలను చూస్తూ తన పడని పోనిస్తూ ఉన్నాడు. ఇంతలో తమకు ఎదురుగా ఏదో వస్తున్నట్లు అనిపించింది. తనతో పాటు ఉన్న వ్యక్తి కొంచెం ముందుకు వొరిగి అలా చూసాడు. క్రొమిటస్ తన టెలిస్కోప్ తో చూసి పడవని పక్కకు తిప్పాడు. అది ఒక పెద్ద రాయి, అప్పుడు అర్థమైంది వాళ్ళకి.. వాళ్ళు ఆ ద్వీపానికి చేరుకున్నారని. అదే డెత్ ఐలాండ్. ఆ ఆనందంలో వారు గట్టిగా అరవడం మొదలెట్టారు. దానితో పడవలో ఉన్న మిగతా వాళ్ళు కూడా లేచి ఆనందం అరవసాగారు. పడవని ఒడ్డు తీసుకువచ్చి, కట్టేసి ఆ ద్వీపాన్ని చూడడానికి బయలుదేరారు. రకరకాల పళ్ళు ఫలహారాలు పుష్కలంగా ఉన్నాయి అక్కడ. అన్ని పుష్కలంగా ఉన్న ఆ ద్వీపానికి డెత్ ఐలాండ్ అని ఎందుకు పేరు పెట్టారో వారికైతే అర్థం కాలేదు. అవన్నీ ఏరుకొని తింటూ ఆనందంతో గంతులు వేస్తూ ఆరోజు అక్కడే గడిపేశారు. తర్వాత రోజు క్రొమిటస్ అందరిని సమావేశపరిచి, తన నౌకలో ఉన్న ఆయుధ సామాగ్రిని అంతటిని బయటకు విసిరేసి నౌక మొత్తం పళ్ళతో నింపేయండి అన్నాడు. కొందరు దానికి అభ్యంతరం చెప్పిన క్రొమిటస్ అవేవీ వినిపించుకోకుండా చెప్పింది చేయమన్నాడు. చేసేదేం లేక అతను చెప్పినట్లే ఒక అంగుళం కూడా ఖాళీ లేకుండా మొత్తం పండ్లతో నింపేశారు వాళ్ళు.
ఇంతకీ వాళ్లు ఆ నిధిని చేరుకున్నారా లేదా క్రొమిటస్ యొక్క అసలు పథకం ఏమిటి? అతను ఎందుకని నౌక మొత్తం పళ్ళతో నింపేయమన్నాడు. వచ్చే దారిలో కనిపించిన ఆ బ్రిటిష్ నౌకలో క్రొమిటస్ గమనించింది ఏమిటి? అనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం.......మీరేం బాధపడకండి త్వరగానే ఆ భాగాన్ని కూడా అప్లోడ్ చేస్తాము. అప్పటి వరకు సెలవు...
ఇట్లు మీ
రామ్...
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి