నిజమే ఆయన గొప్పవారు

అమ్మా. ... ఓ జ్ఞాపకం. volume - 1

 

Image of telugu kattalu

అది DNK పార్టీ కార్యాలయం. ఎలక్షన్స్ లో గెలవడం వల్ల ఆ కార్యాలయం మొత్తం భాజా భజంత్రీలతో సందడిగా ఉంది. పార్టీ కార్యకర్తలంతా డిచ్చిక్ డిచ్చిక్ డింక ఇక తగలెట్టేస్తా నీ లంక అంటూ ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చిందులు వేస్తున్నారు. ఇంతలో అక్కడికి ఆ పార్టీ నాయకుడు వచ్చాడు. అతనే నడక నాగరాజు. పేరుకి తగ్గట్టే అతను పెద్ద కాట్రాజు కావడం వల్ల అతని పార్టీలో ఒక్క మహిళ కార్యకర్త కూడా లేదు. అప్పటి వరకు సందడిగా వున్న ప్రదేశం అతను రాగానే  అంతా నిశ్శబ్దంగా అయింపోయింది. వచ్చి రాగానే ఓ మైక్ ని అందుకుని అరిగిపోయిన 90's స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాడు. ఇక్కడకు వచ్చిన పార్టీ పెద్దలకు నా నమస్కారం, పిన్నలకు నా ఆశీర్వాదం. అలాగే నన్ను ప్రేమతో గెలిపించి నా ఆనందాన్ని నాతో పాటు పంచుకోవడానికి ఇక్కడకు వచ్చిన ప్రజలందరికీ, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. కానీ శిరస్సు వంచీ వంచనట్లుగా, నమస్కారం పెట్టి పెట్టినట్లుగానే లేచిపోయాడు. ఈ DNK పార్టీని గెలిపించిన మీ అందరికీ నా పరిపాలన అంటే ఏంటో చూపిస్తాను. మేము ఇచ్చిన హామీలను వందకు రెండు వందల శాతం నిజం చేస్తాం. DNK పార్టీ అనగానే ప్రతిపక్ష పార్టీలో ఒక్కొక్కడికి చుక్కలు చుక్కలు కనబడాలె. వచ్చే ఎన్నికల్లో  మా ప్రతిపక్షం మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు మీరు వద్దు DNKనే ముద్దు, అనేలా చేస్తాం అని చనిపోయిన మా తాతగారి మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. చివరిసారిగా మరోసారి నన్ను గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా వెనుక ఉండి నన్ను నడిపించిన నా పార్టీ కార్యకర్తలు అన్నా,తమ్ములకు మరియు అక్క, చెల్లెళ్లకు (అలా అనగానే పార్టీ కార్యకర్తలు ఒకరు చూసుకున్నారు) అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అని ముగించి వెళ్లిపోయాడు.


              *                    *                        *                           


వెస్ట్ బెంగాల్ (రాణి గంజ్ కోల్డ్ ఫీల్డ్):

అరే శివ ఇటు రారా అని పిలిచాడు మేనేజర్. అప్పటివరకు అక్కడ ఏదో పని చేస్తున్న శివ అక్కడకు వచ్చాడు. ఏంటన్న పిలిచావు అని అడిగాడు. దారా భోజనం చేద్దాం టైం అవుతుంది అని అన్నాడు. సరే అన్న కడుక్కునే వస్తాను అని కడుక్కోవడానికి వెళ్ళాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఏరా అక్క ఏం చేసింది ఈరోజు వంట అని అడిగాడు మేనేజర్. గుత్తంకాయ వండింది అన్న, నీకు ఇష్టమని రొయ్యలను కూడా వండి పంపింది అమ్మ. అని రొయ్యల కూరను అతనికి అందించాడు శివ. దాన్ని తీసుకుని కొంచెం నోట్లో వేసుకుని హుమ్...అద్భుతం, అమోఘం అంటూ తినసాగాడు. అది చూసి శివ ఏంటి అన్నయ్య వదిన నీకు ఇలా వండి అని పెట్టదా? ఏంటి అని అడిగాడు అనుమానంగా. అది విన్న అతను '' మీ వదిన తనకు అంత సీన్ లేదులే'' అన్నాడు. అయినా నువ్వు నా పెళ్లి చూపులు సంగతి తెలిస్తే ఇలా అడగవులే అన్నాడు. అవునా అసలు నీపెళ్లిచూపులో ఏం జరిగింది ఏంటి? అని అడిగాడు శివ. వద్దులేరా అవన్నీ ఇప్పుడెందుకు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అతను. చెప్పు అన్నయ్య ఇప్పుడు మనకు చాలా టైం ఉందిలే అన్నాడు. హుమ్.. అనుకుని అతను చెప్పడం ప్రారంభించాడు. 

       *                      *                          *                     *
అది నా పెళ్లి చూపులు:
నేను మా అమ్మ, నాన్న ఇతర బంధువులతో అమ్మాయిని చూడటానికి అంటే మీ వదినని చూడడానికి వెళ్ళాం. సాధారణంగా పెళ్లిచూపుల్లో ఎలా కూర్చుంటారో అలాగే మేము కూడా వెళ్లి వారి ఇంట్లో కూర్చుని ఉన్నాం. ఇంతలో తనను తీసుకువచ్చారు. తను అందంగా ఉంటుంది కదా తొలిచూపుల్లోనే నాకు నచ్చేసింది. తనను చూసి నేను ఏ  ఏవేవో ఊహించుకుంటున్నాను. ఇంతలో అల్లుడుగారు, అల్లుడుగారు అని నన్ను వాళ్ళ నాన్న పిలిచాడు. నేను ఆ ఊహాలోకం నుండి తేరుకుని ఆయన వంక చూశాను. ఆయన ''అలా సిగ్గుపడతారేంటి అల్లుడు గారు మీరు ఏమైనా అడగాలనుకుంటే మా అమ్మాయిని అడగండి అన్నాడు. నాకు సడెన్ గా ఏం అడగాలో తెలియక అందరిలానే వంట వచ్చా అని అడిగాను. దానికి తను వచ్చు అన్నట్టుగా కాకుండా, ఇటు రాదు అన్నట్టుగా కాకుండా అదోరకంగా తల ఊపింది. అప్పుడు వాళ్ళ నాన్న కలుగజేసుకుని అబ్బే దాని గురించి మీరేం కంగారు పడకండి అల్లుడుగారు, మా అమ్మాయి వంటల్లో భీముని అటు నలమహారాజుని కూడా ఓడించేస్తుంది అన్నాడు. నేను అబ్బో! అనుకుని. సరే అయితే నాకు ఇప్పటి కిప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి వండి పెట్టగలరా అని అని అడిగాను. అప్పుడు మా మామయ్య ఇప్పటికిప్పుడు అవన్నీ ఎందుకు అల్లుడుగారు, అసలే ముహూర్తం టైం దాటిపోతుంది అన్నాడు. మీరు టైం చూడలేదా మామయ్య మేము ముహూర్తానికి రెండు గంటల ముందే వచ్చేసాం, ఇంకా గంటన్నర టైం ఉంది. ఏమంటారు పూజారిగారు అన్నాను ఆయన వైపు తిరిగి. ఆయన కూడా నవ్వుతూ అవును బాబు అన్నాడు. అప్పుడు మా మామయ్య '' పూజారి గారు మీరు ఊరుకోండి'' అన్నారు. ఏంటి మామయ్య మీ అమ్మాయికి వంట రాదా? రాకపోతే చెప్పండి నేనేమి అనుకోనులే అన్నాను. నేను అలా అనగానే మీ వదిన లేచి మీ ఒక్కళ్ళకేనా లేక అందరికీ చేయమంటారా అని అడిగింది. అందరికంటే టైం అయిపోతుంది కానీ నా ఒక్కడికి చాలు అన్నాను. తను, నాకు వచ్చినట్లుగా చేయమంటారా మీకు నచ్చేటట్లు చేయమంటారా అని అడిగింది. ఏంటి వంటలు ఇన్ని రకాలుగా కూడా చేస్తారా అనుకుని. నేను కొంచెం సేపు ఆలోచించి నాకు నచ్చినట్లే ఉండమన్నాను. తను, అయితే రండి కిచెన్ లోకి వెళ్దాం అంది. నేను మొహమాటంగా ఎందుకు అన్నాను. మీకు నచ్చాలంటే మీకు నచ్చినట్లే వండాలి కదండీ అందుకే, మీరు ఏది ఎంత వెయ్యాలో చెప్తే నేను అతంత వేసేస్తాను అంది. అంతే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపించింది. అలాగే వెళ్ళిపోయాను కూడా కానీ ఎక్కడికో కాదు, మా ఆవిడతో కిచెన్ కు. అప్పుడు మా మామయ్య నా వైపు చూసి, అందుకేనయ్యా ఇందాక నుంచి అవన్నీ ఎందుకు అంది. నీ కర్మ వెళ్ళు అన్నట్టుగా చూశారు. మీరు చెప్తే వినలేదు మామయ్య, సరేలే అనుకుని లోపలికి వెళ్ళాను. చెప్పండి ఎలా చేద్దాం అని అడిగింది తను. హే.. నీకు వంట రాదా అన్నా నేను. తను, నిజంగా వంట వచ్చిన దానిలా వచ్చు కానీ మీరే కదండీ మీకు నచ్చినట్లుగా చేయమన్నారు అంది. సరేనమ్మా సరే అలాగే కానీయ్, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని అడిగాను. మీరు మీకు నచ్చినట్లుగా ఏది ముందు వెయ్యాలో ఏది తర్వాత వేయాలో, ఏది ఎప్పుడు వేయాలో చెప్తే అలా చేసేస్తాను అంది. సరే అని (విసుక్కుంటూ) స్టవ్ వెలిగించు, మంటని మిడిల్ లో పెట్టు, ఇప్పుడు కళాయి దాని మీద పెట్టు అన్నాను. తను అలాగే చేసి కళాయి పెట్టి ఎంతసేపు ఉంచమంటారు అని అడిగింది. అప్పుడు నేను తనకి దండం పెట్టి నేను చెప్పేదాకా  దించకమ్మ అన్నా (వెటకారంగా). దానికి తను ఓనవ్వు నవ్వి ఊరుకుంది. అలా నేను చెప్తూ ఉంటే తను వంట చేస్తూ ఉంది. అలా నల భీమపాకం అవ్వాల్సిన వంట చివరికి, భీమజానకి పాకమవ్వింది. ఎందుకంటే నేను భీమరాజు, తను జానకి. చివరికి ఎలాగోలా వంటని పూర్తి చేసాం. చెరోసగం ఇద్దరం టేస్ట్ చేసి మళ్లీ వెళ్లి ఎవరి స్థానాలు వారు కూర్చున్నాం. అప్పుడు ఏం అల్లుడుగారు మా అమ్మాయి బాగా వంట చేసి పెట్టిందా అని అడిగాడు మా మామయ్య (వెటకారంగా). మీరు మొదట్లో అన్నది తప్పు మామయ్య, మీ అమ్మాయి వంటల్లో నల భీమరాజుల్ని ఓడించడమే కాదు డైరెక్ట్ గా చంపేస్తుంది కూడా అన్నాను. ఆ మాటకి మీ వదిన కొంచెం అలిగింది, కానీ అక్కడ ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. అలా గడిచింది నా పెళ్లి చూపులు అని చెప్పుకొచ్చాడు అతను.
అది విన్న శివ కూడా పగలబడి నవ్వాడు. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్నయ్య అని అడిగాడు. పెళ్లైన దగ్గర నుండి మనకెందుకు వచ్చిన గోల అని, నీకు వచ్చినట్లు వండమన్నా తను అదే చేస్తుంది అన్నాడు (నీరసంగా). మేనేజర్ చెప్పేదంతా విని శివ ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు. నువ్వు ఈ ఒక్క దానికే ఇలా అయితే నా పెళ్లయిన దగ్గర నుండి జరిగిన కళాఖండాలు మొత్తం చెప్తే ఏమైపోతావో అన్నాడు. అప్పుడు శివ అయ్య బాబోయ్ వద్దులే అన్నాడు నవ్వుతూ. అలా నవ్వుకుంటూ తింటూ.. మధ్యలో అవునురా శివ అక్క ఎలా ఉంది, చూసి చాలా రోజులైంది అని అడిగాడు మేనేజర్. బానే ఉంది అన్న కానీ అప్పుడప్పుడు దగ్గు జ్వరం వస్తుంటాయి తనకు అన్నాడు. ఇక్కడే చాలా కాలం పని చేసింది కదా ఈ దుమ్ము ధూలివల్ల అలా వచ్చి ఉంటుందేమో, హాస్పిటల్ కు తీసుకెళ్ళావా అని అడిగాడు. ఆ వెళ్ళాను అన్న డాక్టర్ కు చూపిస్తే చిన్న జ్వరమే తగ్గిపోతుందిలే అని మందులు ఇచ్చాడు. అవునా ఏ హాస్పిటల్ కి వెళ్లారు అన్నాడు. అదే మన పట్నాయక్ డాక్టర్ ఉన్నాడు కదా అతని దగ్గరకు వెళ్ళామన్నా అన్నాడు శివ. మేనేజర్ హే.. వాడు సరిగా చూడడురా, ఒకవేళ ఈసారి వెళ్లాల్సి వస్తే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్ళు అన్నాడు. నేను అలాగే అన్నాను అన్న కానీ అమ్మే వినలేదు అన్నాడు. తను అలాగే అంటుంది కానీ నువ్వు తీసుకెళ్ళు, ఏమైనా డబ్బులు ఇబ్బంది వస్తే నన్ను అడుగు అన్నాడు (చేతులు నాక్కొంటూ). సరేలే అన్న అన్నాడు శివ. అవును మొన్న మన రాజేష్ తో డబ్బులు పంపించాను తీసుకున్నావా అన్నాడు (మే). తీసుకున్నాను అన్న అన్నాడు (శి). ఖర్చు పెట్టేసావ దాచుకున్నావా అన్నాడు (మే). కొంచెం ఖర్చు పెట్టేసానులే అంటే అమ్మకు కొంచెం బరువు తగ్గుతుంది కదా అని. అయినా నీకు ఇంకో విషయం తెలుసా అమ్మకు తెలియకుండా నేను డబ్బులు దాస్తున్నాను ఇప్పటికీ అది ఎంతవ్విందో తెలుసా మూడు లక్షల 50 వేల రెండు వందల రూపాయలు అన్నాడు. అవునా అన్నాడు (మే). అవునన్నా ఇంకో రెండు సంవత్సరాలు అలాగే దాచానంటే అది ఇది కలిపి ఓ 11 లక్షలు అవుతాయి. అప్పుడు 10 లక్షలతో ఒక మంచి ఇల్లు కట్టిస్తాను. దాని తర్వాత మా అమ్మ కోసం ఒక పెద్ద టీవీని కొంటాను. నీకో విషయం తెలుసా అన్న మా అమ్మకు చిన్నప్పటినుంచి సినిమాలంటే పిచ్చి. కానీ తను నా కోసం చాలా వదిలేసుకోవాల్సి వచ్చింది, చివరికి మా నాన్నని కూడా (అని కొంచెం ఎమోషన్ అవ్వాడు). అది గమనించిన మేనేజర్ హే.. ఊరుకోరా నువ్వు చేస్తావులే, ఇల్లు కట్టేటప్పుడు చెప్పు నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానులే అన్నాడు( శివని ఓదారుస్తూ).


ఇంకొక పార్ట్ తో మల్లీ రేపటికి కలుసుకుందాం. అంత వరకు సెలవు .ఇంకా స్టోరీస్ చదవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి: KIDDI STORY

Part two read : అమ్మ ఓ జ్ఞాపకం  - volume 2

Third part :- volume 3

Part 4:- volume 4

కామెంట్‌లు