మేలుకున్న మానవత్వం - small moral story

మనసులో మాట

Image of telugu kattalu


శివ ఓ 12 ఏళ్ల కుర్రాడు చేతిలో ఒక కర్ర సంచి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. సంచిలో కొన్ని పూలు, పళ్ళు, కొబ్బరికాయలు వగైరా ఉన్నాయి. దాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడో అనుకున్నాను. గుడికి అని తెలిసింది. సర్లే అవి పట్టుకుని ఎవరైనా వెళ్తారు ఏంటి గొప్ప అనుకున్నా. కానీ అతనికి కొంచెం దగ్గరగా వెళ్తే అతను వేసే ప్రతి అడుగులోనూ పలుకుతున్న ఒకే ఒక్క స్మరణ నాకు వినపడింది. అది 'మా అమ్మ బతకాలి బ్రతకాలి '' అని. అమ్మ బ్రతకాలి అంటున్నాడంటే ఏదో మంచి కథ అయ్యుంటుంది, వెంటనే అతన్ని అడిగి కథ రాసి. అందరిని నా రచనతో ఏడిపించి బెస్ట్ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కొట్టేయాలి అనుకున్నా. వెంటనే కథ అడుగుదాం అనుకున్న కానీ, అసలే బాధలో ఉన్నాడు కదా ఏం చెప్తాడులే అనే ఆలోచించా. కానీ నాకు ఆ కథ ఎలాగైనా కావాలని అనిపించింది. ఏం చేయాలో తెలీక దేవుణ్ణి ప్రార్థించాను. నాది కొంచెం చిన్న కోరిక కదా అందుకే ఆ దేవుడు కొంచెం త్వరగానే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నేను నా దొంగ జపాన్ని ఆపి నా మనసులో ఉన్న కోరికను ఆయనకు విన్నవించాను. అప్పుడు ఆయన నవ్వి చూడు నాయనా నువ్వు కొత్తవి కదా నీకు అంతగా తెలియదులే, మీలాంటి రచయితలకు ఇంతకు ముందుగానే ఒకరి మనసు లోతుల్ని కూడా చదివి వర్ణించగల శక్తిని ప్రసాదించాం. నువ్వు ఆవరాన్ని మళ్లీ నాకు కోరనవసరం లేదు. కోరి నీ,నా సమయాన్ని వృధా చేయనవసరం లేదు అన్నారు. కానీ అది ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాను.   అప్పుడు ఆయన వీడి దుంపల్ తెగ..అనుకుని ఆయన మాయ చేత నాకు ఒక కళ్ళద్దాలు ఇచ్చారు. వాటిని వేసుకుంటే మనుసుల్ని చదవగలమంట. అది వేసుకుని నేను నిజంగా అది పనిచేస్తుందో లేదో అని ఆయన వంకే తిరిగి చూశాను.

అప్పుడు ఆయన మనసులో ఉన్నది
నా భార్యని ఉదయం పాలకూర చేయమంటే మెంతికూర చేసింది. నాకేమో అదంటే సరిగా నచ్చదు. ఒకవేళ తినకుండా ఊరుకుందామా అంటే, నేను వండేది ఏది నచ్చదు మీకు అని అడుగుతుంది. తన అలక తీరాలంటే దానికి మళ్ళీ నేను ఇంకో అవతారం ఎత్తాలి. తన అలక తీరెలోగ నా తల ప్రాణంతో తోకకు వస్తుంది. తను ప్రేమతో మెంతికూర కలిపి పెడుతుంటే, దాన్నుంచి తప్పించుకోవడానికి నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడని వీడు దొంగ జపం చేస్తున్న వచ్చాను. ఇక్కడ వస్తే వీడి  టార్చర్. దీనికన్నా ఆ మెంతికూరే బాగుండేదేమో అనుకుంటున్నాడు ఆయన. అలా నేను ఆయన మనసుని చదివి నవ్వుకుంటున్నాను. నేను ఆయన మనసుని చదివేది గమనించి, ఆయన నాకు ఒక గుడ్ బాయ్ కూడా చెప్పకుండా టపుక్కున మాయమైపోయారు. అప్పుడు నేను ఆయన వెళ్ళిపోతే  ఏం ఆయన ఇచ్చిన గ్లాస్సెస్ ఉన్నాయి కదా అనుకుని, దాన్ని పట్టుకుని శివ దగ్గరకు వెళ్ళాను. వెంటనే కథ రాసి అవార్డు కొట్టేద్దామని. ఆ గ్లాసెస్ పెట్టుకుని శివ మనుసు లోతుల్ని చదవడం ప్రారంభించాను. చాలా తక్కువ సమయంలో చదివేసిన సరే ప్రతిక్షణం ఓ యుగంలా గడిచింది నాకు. కారణం నేను కూడా అతనితో పాటు జీవించేసాను. అతను నవ్వుతుంటే నేను నవ్వాను. అతన ఏడుస్తుంటే నేను ఏడ్చాను. పూర్తిగా చదివిన తర్వాత ఆ కథని వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించడానికి నాకు చేతులు రాలేదు అని నేను చెప్పను.
నాకు రాయడానికి చేతులు వచ్చింది, కానీ అది ఎంత వేగంతో అంటే దానికి నేను ఒక కొత్త పేరు పెట్టేంత. ఆ పేరు గజగజ గజగజ. దాన్ని సాధారణంగా వణకడం అంటారులేండి. కానీ దాన్ని తర్వాతే అర్థమైంది దాన్ని వర్ణించడం నావల్ల కాదని. కానీ నాలాంటి ఒక రచయితే నావల్ల కాదు అని ఆగిపోతే, ఇంకా నేను రాసే రచనలకు, నాకు విలువ ఉండదని ఆలోచించాను. అందుకే ఆ కథని చెప్పే దారిలో నేను ఓడిపోయిన పర్లేదు ప్రయత్నిద్దామని అనుకున్నాను. ఆరోజు చేసిన నా వంతు ప్రయత్నం ఈనాటి కథ అమ్మ... ఓ జ్ఞాపకం.
నా వంతు ప్రయత్నించాను, మీ వంతు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
కథని రేపటికి మీ ముందుకు తీసుకురాబోతున్న రాబోతున్నాం.. కచ్చితంగా అది మీకు నచ్చుతుందని, నచ్చాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ చరణ్..

Part one read : అమ్మా ఓ జ్ఞాపకం

Part two read : జ్ఞాపకాలు 

కామెంట్‌లు