నిజమే ఆయన గొప్పవారు

Your my heart beat- untold telugu love story

 

Image of love stories

అది ఒక సిటీ. పేరు మాత్రం అడక్కండి మీకు నచ్చిన పేరు పెట్టేసుకోండి. ఆ సిటీలో ఉన్న ఒక ఇంట్లో భార్య భర్తలు ఇద్దరూ గొడవ పడుతున్నారు. క్షమించండి పొరపాటున భార్యాభర్తల అనేసాను, భార్య మాత్రమే గొడవ పడుతూ ఉంది. తన భర్త మాత్రం నిదానంగా తన భార్య తిట్టేదంతా వింటూ ఉన్నాడు. ఎంత ఆశక్తిగా వింటున్నాడంటే చిన్నప్పుడు నేను లెక్కల పాఠం విన్నంత ఆసక్తిగా. వింటే ఒక బాధ, వినకపోతే ఇంకో బాధ కాబట్టి తప్పక వినాల్సిందే అన్నట్టు వింటూ ఉన్నాడు. తన భార్య మాత్రం ఛీ ఛీ నీలాంటి వాళ్ళని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. నీకు సిగ్గులేదు,బుద్ధి లేదు, బుర్ర లేదు అని అంది. అయినా అతనిలో ఏ చలనం లేదు. దాంతో ఆమె మీరు అసలు మనిషేనా నేను ఇంతలా తిడుతూన్నా కొంచెం కూడా చలించట్లేదు అని అంది. ఆమె అలా అన్న అతను మాత్రం దిష్టిబొమ్మలాగా నిలబడే ఉన్నాడు. మీరు నిజంగా మనిషే కాదు కోతి, కుక్క, నక్క తాబేలు జిరాఫీ దున్న అన్ని అంది విసుక్కుంటూ. అయినా అతని మొహంలో కొంచెం కూడా కోపం గాని తిట్టినందుకు ఫీల్ అవ్వడం గాని లేదు. పైగా ఆమె అలా తిట్టినందుకు చిన్నగా నవ్వు కూడా వచ్చింది అతనికి. దాంతో ఆమెకు మరింత మండినట్టుంది  నేను ఇంతలా బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా, అది నువ్వు అనుకుంటున్నట్లు చిన్న విషయం కాదు ఇట్స్ మై లైఫ్ అంది చిరాగ్గా. దాంతో అతను కొంచెం నవ్వాపుకుని ఎందుకు బాధ పడతావని తనని ఓదార్చడానికి తన దగ్గరికి వెళ్ళాడు. కానీ తను నా దగ్గరికి రావద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అలా కొంతసేపు గడిచింది;-
ఆ తర్వాత అతను తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు అక్కడ తను బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అతను కూడా వెళ్లి బెడ్ మీద కూర్చున్నాడు మెల్లగా తన దగ్గరకు జరుగుతూ వెళుతూ ఉన్నాడు. అది గమనించి ఆవిడ అక్కడి లేచి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. అంతలో అతను తనని ఆపి తనే అక్కడ నుండి వెళ్లిపోయాడు. అతను అలా వెళ్ళిపోగానే అతని లేచిన దగ్గర ఏదో కాగితాన్ని తను చూసింది దాన్ని ఓపెన్ చేస్తే
అలా ఓ అరగంట గడిచిన తర్వాత :-
ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళింది. అతను వరండాలో  నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు.  ఆమె అతని దగ్గరకు వెళ్ళి కూర్చుంది. తన రాకను గమనించి అతను అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడానికి సిద్ద పడ్డాడు. ఇంతలో ఆమె అతని దారికి అడ్డంగా నిలబడింది. ఆమె అతని వంక చూస్తూ ఉంది, అతను కూడా తన చూపుని ఆమె వైపు తిప్పాడు. ఆమె చిన్నగా నవ్వింది దానికి అతను కూడా చిన్నగా నవ్వాడు. అలా ఒకరి వంక ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అలా ఆ నవ్వు కొద్ది కొద్దిగా పెద్దదవుతూ వచ్చింది. కొంతసేపటికి ఇద్దరు పడి పడి నవ్వుకున్నారు.
ఆ లెటర్ లో ఉండింది;-
నువ్వన్నది నిజమే నాకు సిగ్గు లేదు. అందుకే మన ప్రేమ విషయం చెప్పినప్పుడు మీ నాన్న ఎంత తిట్టినా నేను దిష్టిబొమ్మలా నిల్చునే ఉన్నాను. నిజమే నాకు బుద్ధి లేదు, అందుకే పెళ్లిరోజు నీ మెళ్ళో రెండు ముళ్లే వేసాను. నిజమే నేను కోతినే, ఎందుకంటే నీ ప్రేమ కోసం వేయాల్సిన కోతి వేషాలు అంత వేశాను. నేను కుక్కనే, అందుకే నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే ఉంటావు. నువ్వు అన్నట్టు నేను నక్కనే, అందుకే నీ ప్రేమ కోసం అయిదు ఏళ్లు ఎదురు చూసాను. నిజంగా నేను తాబేలే అందుకే ఎంత మెల్లిగానైనా చివరికి నీ ప్రేమని అందుకున్నాను. నేను ఎద్దునే అందువలనే ఇన్నాళ్లు మన ప్రేమ కోసం కష్టపడుతూ వచ్చాను. చివరగా ( ఊ ఊ ఊ ఊ  అని ఆలోచించి) నీకన్నా నేను పొడుగ్గా ఉంటాను అందుకే జిరాఫీను అయ్యాను. అని రాసాడు అతను.
అందువల్లనే ఇద్దరు పిచ్చి వాళ్ళ లాగా పడి పడి నవ్వుతున్నారు.
దాని తర్వాత అతను తనని వాల్ల గదిలోకి తీసుకు వెళ్ళాడు. తనని కళ్ళు మూసుకో అన్నాడు. తను ఎందుకు అంది. చెప్తాను అని చెప్పగా తన కళ్ళు మూసుకుంది. కొంతసేపటికి ఇప్పుడు తెరువు అన్నాడు. తను కళ్ళు తెరిచి చూస్తే అతని చేతిలో తన చిన్ననాటి ఆల్బమ్ ఉంది. దీని కోసమే కదా నీ విశ్వరూపం అన్నాడు అతను నవ్వుతూ . దానికి ఆమె ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకోబోయింది. అప్పుడు అతను ఆల్బమ్ని వెనక్కి లాగి, నేను దీన్ని నీకు ఇస్తాను సరే మరి నాకు ఏమి ఇస్తావు అన్నాడు. అప్పుడు తను నేనెందుకు నీకు ఇవ్వాలి అంది. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి అన్నాడు. నేను నీకు ఏమీ ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంది. ఓ అలాగా అని అతను తనని దగ్గరికి లాక్కొని తన పెదాల్ని తాకుతూ నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకుంటాను అన్నాడు. అప్పుడు తను ఏయ్ ఏం చేస్తున్నావ్ అంది. నువ్వేగా చెప్పావ్ '' ఏం చేసుకుంటావో చేసుకో అని. ఇంక  తను ఎదో చెప్పబోతూంటే తనని ఆపి.  అలా మెల్లిగా  తనను తన కౌగిలిలోకి  తీసుకున్నాడు. అలా  దాని తర్వాత చెప్పేదేముంది వారు ఆ పాతాళ లోకంలో మునిగిపోయారు తేలిపోయారు. వాళ్లకు కొంచెం ప్రైవసీ ఇవ్వాాలి కాబట్టి మనం కూడా దీన్ని ఇక్కడితో ఆపేద్దాం ఎమంటారు.  చివరగా మీకు చెప్పేంత వాన్ని కాదనుకోండి కానీ చెప్తున్న. బంధాలన్నాక చిన్న చిన్న గొడవలు మామూలే, తప్పు మీది అయితే సరిదిద్దుకోండి వేరే వారిది అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఉన్నది ఒకటే జిందగీ, ఈ జిందగీలో మీరు ఉన్నంతకాలం మీకు ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా ఉండండి

ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం kiddistory  లో వెతికి చూడండి.

ఇక్కడ click  చేసి మరిన్ని కథనాలు చదవండి

కామెంట్‌లు