మేలుకున్న మానవత్వం - small moral story

RRR - Roar Rise Realize - untold story

 

Telugu stories _Kiddistory

ఒకసారి ఒక ఫేమస్ యుట్యూబర్  కంటెంట్ కోసం ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఐడియా వచ్చింది, తన దేశం జెండా పట్టుకుని వీడియో రికార్డింగ్ చేస్తూ అలా బయటకు వెళ్ళాడు. ఇంతలో అతనికి దారిలో ఇంకో అతను కనిపించాడు. ఈ యుట్యూబర్ అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, తన చేతిలో ఉన్న జెండాను ఇచ్చి దీన్ని చింపితే మీకు 5000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అప్పుడు అతను మన దేశం జెండాను నేనేలా చింపుతాను బ్రదర్, నావల్ల కాదు అని వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోగానే ఈ యుట్యూబర్ ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంతలో అతనికి ఇద్దరు అమ్మాయిలు కనిపించారు, వాళ్లకు కూడా జెండాను ఇచ్చి ఈ జెండాను చింపితే 5000 రూపాయలు ఇస్తాను అన్నాడు. దానికి వారు కూడా ఒప్పుకోలేదు. అలా తను దారిలో వచ్చిన వారందరినీ అడుగుతున్నాడు, కానీ ఎవరూ  ఒప్పుకోకపోవడంతో అలా నడుస్తూ మార్కెట్ వైపు వెళ్ళాడు. మార్కెట్లో కూడా కనిపించిన వారందరినీ అడిగాడు కానీ ఎవరూ  ఒప్పుకోలేదు. చివరిగా ఒక ప్రేమజంట వస్తూ కనిపించారు అతనికి, వారిని కూడా ఆపి ఈ జెండాను చింపితే మీకు 5000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ లవ్ బర్డ్స్ లో అబ్బాయి కలుగజేసుకుని, ఒక్క 5000 రూపాయలు ఏం సరిపోతాయి బ్రదర్ ఇంకొక 5000 రూపాయలు కలిపి మొత్తం పదివేలు ఇస్తే నా బేబీ కి ఏదైనా గిఫ్ట్ కొని ఇస్తా అన్నాడు. అప్పుడు ఆ యుట్యూబర్ సరే పదివేలు ఇస్తా చింపుతారా అన్నాడు. అప్పుడు అతను ఏంటి బ్రదర్ మీరు మరీ మొహమాటపడుతున్నట్టున్నారు 10,000 అంటే అంతేనా దానికి ఇంకొ  పది కలిపి మొత్తం 20 ఇస్తే నెక్స్ట్ మంత్ నా బేబీ బర్త్ డే కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాను అన్నాడు. సరే సార్ మొత్తం 20 ఇప్పుడు ఏమంటారు అన్నాడు ఆ యుట్యూబర్. అప్పుడు అతను అంటే బ్రదర్ దేశం జెండా కదా దాన్ని చింపిన తర్వాత నా కెరీర్ మొత్తం కోర్టు కేసులు చుట్టూ తిరుగుద్దేమో కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మూడు కాదు ఒక నాలుగు ఇచ్చావంటే సరిపోద్ది అన్నాడు. ఆ యూట్యూబర్ కొంచెం చిరాకుగా తన బ్యాగులో ఉన్న 40,000 తీసి అతని ముందు, పెట్టి ఇదిగో నలభై వేలు ఇప్పుడైనా చెపుతారా చింపారా అన్నాడు. దానికి అతను చిన్నగా నవ్వి ఏంటి బ్రదర్ నేను 400 కోట్లు అడిగితే నువ్వు 40 వేలు ఇస్తున్నావ్ అన్నాడు. ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోయారు, 400 కోట్ల అని నోరేళ్లబెట్టారు. డీల్ ఓకేనా బ్రదర్ 400 కోట్లు అన్నాడు అతను మళ్ళీ. అంత డబ్బుతో ఏం చేస్తావ్ బ్రో అన్నాడు ఆ యుట్యూబర్.  ఫ్యామిలీ మొత్తం తో లండన్ పారిపోయి బిజినెస్ పెట్టుకుంటాను, తెలుసుగా లండన్ మన దేశద్రోహుల అడ్డ అని అన్నాడు. సారీ బ్రో అని చెప్పి ఈ యుట్యూబర్ వెనక్కి వచ్చేస్తుంటే అతని ఆపి, లేకపోతే ఏంటి బ్రో ఒక ఆర్మీ వాన్ని ఆపి జెండా చింపమంటే కష్టం కదా అన్నాడు అతను. దానికి ఆ యుట్యూబర్ ఆశ్చర్యపోతూ  బ్రో నువ్వు నిజంగా ఆర్మీ యా అన్నాడు. దానికి అతను అవునన్నట్టు తలూపాడు. ఆ యూట్యూబర్ ఆనందంతో ఊగిపోతూ అతని హగ్ చేసుకుని  సారీ  బ్రో అన్నాడు, దానికి అతను పర్వాలేదులే బ్రో అన్నాడు. దాని తర్వాత వారు ''వుయ్ లవ్ అవర్ కంట్రీ'' అంటూ అతనితో ఫోటోలు తీసుకున్నారు. ఏంటి బ్రో మరి మీరు ఇక్కడ అని అడిగాడు ఆర్మీ అతన్ని. దానికి ఆర్మీ అతను లీవ్ మీద వచ్చాను బ్రో మా మ్యారేజ్ ఉంది అన్నాడు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో అన్నాడు ఇతను, దానికి ఆర్మీ అతను థాంక్స్ చెప్పి మరి దేనికి బ్రో ఈ పని చేస్తున్నారు అని అడిగాడు. చిన్న వీడియో బ్రో జాతీయ జెండా మీద ప్రజల్లో ఉన్న నమ్మకానికి చిన్న టెస్ట్ అన్ని అన్నాడు ఇతను.
అలా వారి మధ్య సంభాషణ జరుగుతుంది...

వీరి సంభాషణని మొదటి నుండి గమనిస్తున్న ఒక వ్యక్తి మెల్లిగా వీరు ముందుకు వచ్చాడు. వయసు 30 నుండి 35 మధ్యలో ఉంటుంది అతనికి. మురికి జుట్టుతో, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు. వచ్చి రాగానే వీళ్ళతో సారు దీనిని చింపితే నిజంగా డబ్బులు ఇస్తారా అన్నాడు.
దానికి వాళ్లు అవును దీన్ని చింపితే 5000 అన్నారు చిన్నగ నవ్వుతూ. అలా అన్నారో లేదో ఇతను వెంటనే ఆ జెండాను తీసుకుని ముక్కలు, ముక్కలుగా చింపేశాడు. చింపేసి ఆ ముక్కలను ఆ యూట్యూబర్ చేతిలో పెట్టి సారు డబ్బులు అని అడిగాడు ఆశగా. జెండాను చింపడం చూసిన ఆర్మీ అతనికి చిర్రెత్తుకొచ్చింది కోపంతో అతని కాలర్ పట్టుకుని  ఎడాపెడా వాయించేసాడు, అంతటితో ఆగక అతన్ని కింద పడవేసి తన్నడం తొక్కడం చేస్తున్నాడు. అప్పుడు ఆ యుట్యూబర్  ఇంకా కొందరు వచ్చి బ్రో ఇంకా చాలు అని అతన్ని వెనక్కి లాగారు. నన్ను ఆపకండి బ్రదర్ అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు డబ్బుల కోసం దేశాన్ని కూడా అమ్మేస్తారని కోపంతో రగిలిపోతున్నాడు. బ్రో వద్దు ఇది ఇంకా పెద్ద గొడవ అవుతుంది, అయినా ఇలాంటి వాళ్ళు ఏం చేసినా మారరు అన్నాడు యుట్యూబర్. దానికి ఆ ఆర్మీ అతను కొంచెం తగ్గి, అక్కడ గుమ్మిగూడిన వారందరిని పక్కకు జరుపుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారు అలా వెళ్ళిపోవడం చూసిన ఇతను సారు డబ్బులు అని అరిచాడు. ఆరుపుని విని ఆ ఆర్మీ అతను వెనక్కి వస్తుంటే, బ్రదర్ మీరు ఆగండి అన్నాడు ఆ యుట్యూబర్.  వెనక్కి వెళ్లి 5000 తీసి తీసుకోరా చెత్త  నాయాల అని ఆ డబ్బుని అతని ముఖం మీద విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ యుట్యూబర్ తన ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేశాడు కొన్ని గంటల్లోనే ఆ వీడియోని కొన్ని లక్షల మంది వీక్షించారు.

అలా ఒక రోజు గడిచింది

ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసిన ట్రెండింగ్ లో ఉన్న ఒకే ఒక టాపిక్ అదే. ఒక్క రోజులోనే ఆ వీడియోని కొన్ని కోట్ల మంది చూశారు. చూసిన వాళ్ళందరూ ఇలాంటి వారి వల్లే దేశం రోజు,రోజుకు దిగజారిపోతుంది అని, మేము ఆ ఆర్మీ అతనికి సపోర్ట్ చేస్తామని ఎవరికి తోచినట్లు వారు ఆ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. ఇంకా న్యూస్ చానల్స్ వారి సంగతి చెప్పనక్కర్లేదు కదా వారి క్రియేటివిటీని వారు చూపిస్తున్నారు. కొందరైతే ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతని మీద కేసు పెట్టారు. దాన్ని కూడా వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అందరూ మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి అని  ట్వీట్ చేశారు. ఇంకా పోలీసులు కూడా చేసేదేం లేక అతని వెతికే పనిలో పడ్డారు. వెతికి వెతికి చివరికి అతన్ని పట్టుకున్నారు, స్టేషన్ కు  తీసుకువచ్చి అతని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. ఇదంతా లాయర్ శేఖర్ గమనిస్తూ ఉన్నాడు, అతను చేసింది తప్పే అని తెలిసిన అందరి చేత శిక్షించబడుతున్న అతని మీద శేఖర్ కి  జాలి కలిగింది. వెంటనే స్టేషన్ కి వెళ్లి అతన్ని   బెయిల్ మీద బయటకు తీసుకువచ్చాడు. తర్వాత అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు, అతని గురించి అంతా అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పింది అంతా విన్నాక అతను చేసింది పెద్ద తప్పు ఏమీ కాదని అతని మనసుకు అర్థమైంది. కానీ ఇది ఇక్కడితో ఆగిపోయే విషయం కాదని అతనికి తెలుసు అతని గురించి అందరికి తెలియాలి అనుకున్నాడు. అప్పుడు శేఖర్ అతన్ని ఇలా అడిగాడు మీరు ఇదే విషయాన్ని కెమెరా ముందు చెప్పగలరా  మిమ్మల్ని ఈ సమస్య నుండి నేను బయట పడేస్తాను అన్నాడు. దానికి అతను సరే అన్నట్టు తలూపాడు. వెంటనే శేఖర్ అన్నకు తెలిసిన కొందరు కెమెరామెన్లను కాల్ చేసి పిలిపించి  అతనితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు.
ఇంతకీ అతను ఏమి చెప్పాడు ,ఇంతకీ అతని కథ ఏంటి? అతను ఎందుకు అలా చేయవలసి వచ్చింది, వీడియో రికార్డింగ్ చేసిన కెమెరామెన్ లను  సైతం కన్నీటి పర్యంతం చేసిన  ఆ కథని ఇంకొక భాగంలో తెలుసుకుందాం...

కామెంట్‌లు