- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఒకసారి నేను పొలానికి వెళ్లి తిరిగి వస్తూ ఉన్నాను. దారిలో నాకు తాతగారు (పక్కింటి తాతగారు) కలిశారు. మౌనంగా నడవడం ఎందుకని మెల్లిగా మాటలు కలిపాను.ఏం తాతా పొలానికి వెళ్ళావా అని అడిగా. దానికి ఆయన, అవును తాత అని చిన్నగా నవ్వుతూ అన్నారు. మీకు ఎన్ని బస్తాలు పంట వస్తుంది తాత అని అడిగాను. వస్తాయి ఒక పది,పన్నెండు అన్నాడు. ఓహో అనుకుని, మళ్లీ వేసవి పంట కూడా వేస్తారా తాత అని అడిగాను. అవును బాబు అన్నాడు ఆయన. అయితే ఇది ఒక పన్నెండు అది ఒక పన్నెండు మొత్తం ఇరవై నాలుగు అన్న చిన్నగా నవ్వు టు నవ్వుతూ. దానికి ఆయన కూడా చిన్నగా నవ్వాడు.అలా మా సంభాషన సాగుతుంది. ఇంతలో మా ముందుకు ఇంకో ముసలాయన భీముల్లాగా నడుస్తూ వస్తున్నాడు
ముఖం మొత్తం చిరాగ్గా పెట్టుకుని నడుస్తున్నాడు. ఆయన్ని చూసి ఇద్దరం పక్కకు తప్పుకున్నాము. ఆయన వడివడిగా వస్తూ మధ్యలో నుండి వెళ్లిపోయాడు. ఆ ముసలాయన అలా వెళ్ళిపోగానే, నేను ఈ తాతతో ఇలా అడిగాను. తాత ఆ ముసలాయన ఎందుకు ఎప్పుడు చూసినా అలా చిరాగ్గానే ఉంటాడు, ఆయన ఎప్పుడూ నవ్వింది చూడలేదు అని అడిగా.దానికి ఆ తాత అతను చాలా బాగా నవ్విస్తాడని చెప్పాడు. నాకేమీ అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. అప్పుడు ఆ తాత ఆ ముసలాయన గురించి ఇలా చెప్పుకొచ్చారు.
ఆ ముసలాయన వయసులో ఉన్నప్పుడు
ఒకరోజు ఆయన ఉదయాన్నే లేచి, చింతపండు అమ్మడానికి సంతకు వెళ్ళాడు. రేటు బాగానే పలికింది,దాన్ని అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. అలా వస్తూవుంటే అతనికి సినిమా ధియేటర్ కనిపించింది. అప్పటికి మధ్యాహ్నం కావడంతో ఫస్ట్ షో చూసిన వాళ్లందరూ బయటకు వస్తున్నారు. బయట టికెట్లు తీసుకునే దగ్గర కూడా ఎక్కువమంది లేకపోవడంతో కచ్చితంగా సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కువమంది లేకపోవడంతో టికెట్లు కూడా తొందరగానే దొరికాయి. అప్పుడు టికెట్ ధరలు రూపాయి, పావలా ఉండే వంట లేండి. టికెట్లు దొరికాక తను చింతపండు అమ్మడానికి తీసుకువచ్చిన బుట్లు, కావడి బద్దలతో సహా థియేటర్ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్లి నేల టికెట్ కావడంతో కిందన కూర్చుని సినిమా ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.
అలా ఓ అరగంట గడిచింది. థియేటర్ అంతా ఫుల్ అయ్యాక తెరమీద బొమ్మ పడింది. సినిమా మెల్లిగా జరుగుతుంది, మొదటిసారి కావడంతో కల్లారపకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు. ఇంతలో చిరంజీవి తన గుర్రం మీద వస్తూ ఉన్నాడు అంతే ఈ తాతకు పై ప్రాణాలు పైనే పోయాయి ఆ గుర్రం వచ్చి ఎక్కడ తొక్కేస్తుందో అనుకున్నాడు ఏమో తాను చింతపండు అమ్మడానికి తెచ్చిన బుట్లు కావడి బద్దలను ఆ తెరమీదకు విసిరేసి, పంచే ఎత్తుకొని పారిపోయాడు. అతను అలా చెప్పాడో లేదో నాకు అసలు నవ్వగలేదు పడి పడి నవ్వాను. అంత సీరియస్ గా కనిపించే అతని వెనుక ఇంతటి కామెడీ మెన్ దాగే ఉన్నాడా అనిపించింది. మొత్తానికి విసిరిన దెబ్బకి థియేటర్ తెర చెరిగిపోయింది, సినిమా ఆగిపోయింది, ఈ కథ కూడా ...
అదండీ ఆ ముసలాయన మొదటి సినిమా అనుభవం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.ఈ కథ మీకు చాల బాగ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ముందు ముందు ఇలాంటి ఆసక్తికర కథనాలతో మీ ముందుకు వస్తా..
కిడ్డి
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి